Maha Kumbha Mela: ఈ అఖారాలోని 70 శాతం మంది సన్యాసులు విద్యావంతులే.. ప్రొఫెసర్లు, వైద్యులు కూడా.. ఆస్థులు ఎన్ని వేల కోట్లు అంటే..

Maha Kumbha Mela: ఈ అఖారాలోని 70 శాతం మంది సన్యాసులు విద్యావంతులే.. ప్రొఫెసర్లు, వైద్యులు కూడా.. ఆస్థులు ఎన్ని వేల కోట్లు అంటే..


కొత్త సంవత్సరం 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళాను నిర్వహించనున్నారు. ఈ మహా కుంభ మేళాలో దేశంలోని మొత్తం 13 అఖారాలకు చెందిన ఋషులు, సాధువులు సమావేశం కానున్నారు. ఈ సాధువులు పవిత్ర త్రివేణీ సంగమ ప్రాంతంలో స్నానం చేస్తారు. ఈ అఖారాలలో ఒకటి నిరంజని అఖారా. ఈ అఖారా శివుని కుమారుడైన కార్తికేయుడిని ఇష్ట దైవంగా భావించి పూజిస్తారు. ప్రస్తుతం నిరంజని అఖారా మహా మండలేశ్వరుడు డాక్టర్ సుమనానంద గిరి. ఈ అఖారా ప్రధాన కార్యాలయం ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. ఈ అఖరా లో ఉన్న మహంతులు, దిగంబర సాధువులు, అఖారా మహామండలేశ్వరులు. నిరంజని అఖారాల గురించి తెలుసుకుందాం…

గుజరాత్‌లో స్థాపించబడిన నిరంజని అఖారా

నిరంజని అఖారా 726 ADలో గుజరాత్‌లోని మాండ్విలో స్థాపించబడింది (విక్రమ సంవత్సరం 960). ఈ అఖారా ఆశ్రమాలు ఉజ్జయిని, హరిద్వార్, త్రయంబకేశ్వర్, ఉదయపూర్‌లలో ఉన్నాయి. ఈ అఖారా కు చెందిన మతపరమైన జెండా కుంకుమ రంగులో ఉంటుంది. ఈ అఖారా పూర్తి పేరు శ్రీ పంచాయితీ తపోనిధి నిరంజని అఖారా. ఈ అఖారా ప్రధాన ఆశ్రమం హరిద్వార్‌లోని మాయాపూర్‌లో ఉంది. ఈ అఖారా దేశంలోని ప్రధాన అఖారాలలో ఒకటిగా లెక్కించబడుతుంది. జునా అఖారా తర్వాత అత్యంత శక్తివంతమైన అఖారా నిరంజనీ అఖారా అని నమ్ముతారు.

అత్యధిక సంఖ్యలో విద్యావంతులైన సన్యాసులు

శ్రీ పంచాయితీ తపోనిధి నిరంజని అఖారాలో అత్యధికంగా విద్యావంతులైన సాధువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అఖారాలోని సాధువులలో ప్రొఫెసర్లు, వైద్యులు సహ పలు రంగాల్లోని నిపుణులు ఉన్నారు. ఈ అఖారా శైవ సంప్రదాయానికి చెందినది. ఈ అఖారాలోని 70 శాతం మంది సాధువులు ఉన్నత విద్యను అభ్యసించినవారే. ఈ అఖారా అత్యంత ధనిక అఖారాలలో ఒకటి అని తెలుస్తోంది. ఈ అఖారా ప్రత్యేకత దానిలోని విద్యావంతులైన సన్యాసులు. ఈ అఖారాలో ఐఐటీ నుంచి పట్టపుచ్చుకున్న కొందరు సాధువులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

1000 కోట్లకు పైగా ఆస్తులు

ప్రయాగ్‌రాజ్.. దాని పరిసర ప్రాంతాలలో శ్రీ పంచాయితీ తపోనిధి నిరంజని అఖారాకి సంబంధించిన అపారమైన సంపద ఉంది. నిరంజని అఖారా ఆస్తులలో ప్రయాగ్‌రాజ్, దాని పరిసర ప్రాంతాల్లోని మఠాలు, దేవాలయాలు, భూమి ఉన్నాయి. ఈ ఆస్తులన్నింటి విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇతర రాష్ట్రాల్లోని అఖారా ఆస్తులను కలిపితే ఆ విలువ రూ.1000 కోట్లు దాటుతుంది. ఈ అఖారాలోని నాగ సన్యాసుల సంఖ్య అయితే 10,000 కంటే ఎక్కువ. మహామండలేశ్వరుల సంఖ్య 33. ఈ అఖారాలో 1000 మందికి పైగా మహంతులు, శ్రీ మహంతులు ఉన్నారు.

కుంభ మేళా సమయంలో సంపూర్ణ సన్యాస దీక్ష

ఈ అఖారాలో చేరిన వారికి శాశ్వత, తాత్కాలిక దీక్షలను అందించే సంప్రదాయం ఉంది. గృహస్థుల కుటుంబాల నుంచి వచ్చిన వారికి తాత్కాలిక దీక్షను ఇస్తారు. తాత్కాలిక సన్యాస దీక్ష ఇచ్చే ముందు.. సన్యాసం తీసుకునే వ్యక్తిని పరీక్షిస్తారు. సన్యాసం తీసుకున్న వ్యక్తికి సన్యాసం జీవించే లక్షణాలు ఉన్నాయా లేదా అని చూస్తారు. ఎవరైనా సన్యాసం పట్ల తగిన ఆసక్తి చూపకపోతే.. వారికి పూర్తి దీక్ష ఇవ్వకముందే ఇంటికి పంపుతారు. అదే సమయంలో.. సన్యాసి జీవితాన్ని గడిపే లక్షణాలున్న వారికి కుంభ మేళా సమయంలో సంపూర్ణ సన్యాస దీక్షను ఇస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *