Liver Detoxify: మీ లివర్ పాడవకుండా క్లీన్‌గా ఉండాలంటే వీటిని తింటే చాలు..

Liver Detoxify: మీ లివర్ పాడవకుండా క్లీన్‌గా ఉండాలంటే వీటిని తింటే చాలు..


శరీరంలో ముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. లివర్ ముఖ్యమైన పనులు చేస్ుతంది. విష పదార్థాలను, మలినాలను, వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో లివర్ ఎంతో చక్కగా పని చేస్తుంది. జీర్ణ క్రియను కూడా ప్రోత్సహిస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వాలన్నా లివర్ పాత్ర ముఖ్యం. శరీరంలో ముఖ్యమైన హర్మోన్లు, ఎంజైమ్‌లను తయారు చేస్తుంది. దాదాపు శరీరంలో 500 క్రియలను నిర్వర్తిస్తుంది లివర్. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ ఎంతో సహాయ పడుతుంది. అంతే కాకుండా శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, ప్రోటీన్లను తయారు చేయడంలో, కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడంలో కూడా లివర్ సహాయం చేస్తుంది. ఇన్ని పనులు చేసే లివర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో చాలా మంది లివర్ పాడైయి చనిపోతున్నారు. కానీ ఈ ఆహారాలు తింటే లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూడండి.

కాఫీ:

కాఫీ ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా తీసుకుంటేనే అది మేలు చేస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం.. ప్రతి రోజూ రెండు లేదా మూడు కప్పుల కాఫీని తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. లివర్ ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా కాఫీ ఎంతో చక్కగా పని చేస్తుంది. కాఫీలో కూడా ఉండే గుణాలు.. లివర్ సమస్యలు రాకుండా చూస్తుంది. లివర్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. లివర్‌లో పేరుకు పోయిన వ్యర్థాలు, మలినాలను బయటకు పంపించడంలో కూడా కాఫీ ఎంతో బాగా సహాయ పడుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఒక కప్పు అయినా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. గ్రీన్ టీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల లివర్ కూడా క్లీన్ అవుతుంది. ఈ టీ ఉండే పోషకాలు.. లివర్‌ను సంరక్షిస్తాయి.

బెర్రీస్:

బెర్రీస్ జాతికి చెందిన స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటివి తినడం వల్ల కూడా లివర్ ఆరోగ్యంగా పని చేస్తుంది. వీటిల్లో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు లివర్‌కు రక్షణగా నిలుస్తాయి. లివర్‌లో ఫ్యాట్ పెరగకుండా చేస్తాయి. వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. అదే విధంగా ద్రాక్ష, బీట్ రూట్, ఆలివ్ ఆయిల్, చేపలు వంటివి తీసుకోవడం వల్ల కూడా లివర్ ఆరోగ్యంగా పని చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *