LIC Bima Sakhi Yojana: మహిళల కోసం ఎల్ఐసీ నయా ప్లాన్.. ప్రతి నెలా రూ.7 వేల వరకు ప్రయోజనం

LIC Bima Sakhi Yojana: మహిళల కోసం ఎల్ఐసీ నయా ప్లాన్.. ప్రతి నెలా రూ.7 వేల వరకు ప్రయోజనం


దేశవ్యాప్తంగా ఉన్న మహిళల సాధికారత కోసం ఈ కొత్త పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. మహిళలు బీమా ఏజెంట్లుగా (బీమా సఖీ) అవకాశం పొందుతారు. వీరికి నెలకు రూ.7,000 వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ నేపథ్యంలో బీమా సఖీ యోజన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన ప్రధాన పథకాలలో ఇది ఒకటిగా ఉంటుంది. 10వ తరగతి పాస్ అయిన 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల కోసం ఉద్దేశించి రూపొందించారు. వారికి ముందుగా మూడేళ్ల శిక్షణ ఇచ్చి ఆర్థిక అవగాహన పెంచి బీమా ప్రాముఖ్యతను ఎలా అర్థం చేసుకోవాలో? తెలియజేస్తారు. 

మూడు సంవత్సరాల శిక్షణ పొందిన తరువాత వారు పూర్తి స్థాయి ఏజెంట్లుగా మారతారు. అయితే వీరు ఎల్ఐసీకు సంబంధించిన సాధారణ ఉద్యోగులుగా ఉండరు. అలాగే ఎలాంటి ఉద్యోగుల ప్రయోజనాలను అందుబాటులో ఉండవు. బీమా సఖీ పథకంలో పాల్గొనే మహిళలు మూడేళ్ల శిక్షణ కాలంలో మొత్తం రూ. 2 లక్షలకు పైగా స్టైఫండ్‌ను అందుకుంటారు మొదటి సంవత్సరం: నెలకు రూ. 7,000, రెండవ సంవత్సరం: నెలకు రూ. 6,000, మూడవ సంవత్సరం: నెలకు రూ. 5,000 అందిస్తారు.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు ఇలా

  • ముందుగా ఎల్ఐసీ ఇండియాలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోమ్ పేజీలో, పేజీ దిగువన ఉన్న “బీమా సఖి కోసం ఇక్కడ క్లిక్ చేయండి” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
  • ఈ పేజీలో, మీరు పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామాతో సహా మీ వివరాలను పూరించాలి.
  • ఏదైనా ఎల్ఐసీ ఏజెంట్, డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఉద్యోగి లేదా మెడికల్ ఎగ్జామినర్‌తో ద్వారా దరఖాస్తు చేస్తే వారి వివరాలను ఎంటర్ చేయాలి. 
  • తరువాత క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి సబ్ మిట్ బటన్‌ను క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ విజయవంతంగా సబ్‌మిట్ అవుతుంది.
  • అనంతరం దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయ అధికారులు మీకు కాల్ చేసి బీమా సఖీ యోజనకు సంబంధించి అదనపు వివరాలను తెలియజేస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *