తనకు నీచ రాశి అయిన కర్కాటకంలో వక్రించిన కుజుడి వల్ల కొన్ని రాశుల వారికి మాంగల్య దోషంతో పాటు మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జనవరి 21 వరకూ కుజుడు వక్ర గతిలో సంచారం సాగించబోతున్నందువల్ల కుజుడికి కొన్ని రాశుల వారు పరిహారాలు చేయించు కోవడం కూడా మంచిది. మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారు ఆర్థిక విషయాల్లోనూ, కుటుంబ వ్యవహారాల్లోనూ, ముఖ్యంగా దాంపత్య జీవితంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతి రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం లేదా కాలభైరవాష్టకం పఠించడం, ఎర్ర రంగు కలిసిన దుస్తుల్ని ధరించడం, పగడం పొదిగిన ఉంగరం పెట్టుకోవడం వంటివి కుజుడికి సరైన పరిహారాలని గుర్తించడం మంచిది.
- మిథునం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానమైన కర్కాటకంలో కుజుడు వక్రించడం వల్ల దాంపత్య జీవితంలో కలతలు రేగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలు పెట్టుకోకపోవడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. వడ్డీలకు ఇవ్వడం, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం చాలా మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో గోప్యత పాటించడం అవసరం. తొందరపాటుతనంతో వ్యవహరించవద్దు.
- కర్కాటకం: ఈ రాశిలో కుజుడి వక్ర సంచారం వల్ల కోపతాపాలు, చిరాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. దాంపత్య జీవితంలో కొద్దిగా మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆర్థిక వ్యవహా రాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపా రాల్లో కూడా సహనం కోల్పోయే అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో ప్రవర్తించాల్సి ఉంటుంది.
- సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజుడి వక్ర సంచారం వల్ల దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. జీవిత భాగస్వామిని అపార్థం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంటుంది. బాగా సన్నిహితులు, మిత్రుల వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఆశాభంగాలు కలుగుతాయి.
- ధనుస్సు: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజుడు వక్రించడం వల్ల దాంపత్య జీవితంలో మాటలు, చేతల విష యంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దంపతుల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిం చడం లేదా బదిలీ కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు, కోర్టు కేసుల్లోచిక్కులు తలెత్తుతాయి. ధన నష్టం లేదా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయ త్నాలకు తాత్కాలికంగా బ్రేక్ వేయడం శ్రేయస్కరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంల వక్ర కుజుడి సంచారం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తే అవ కాశం ఉంది. జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. మీ రహస్యాలను బంధుమిత్రులతో పంచుకోవడానికి ఇది సమయం కాదు. ఆస్తి ఒప్పందాలను, గృహ ఒప్పందాలను వాయిదా వేయడం ఉత్తమం. ఆస్తి వివాదాలు బాగా ఇబ్బంది పెడతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు.
- కుంభం: ఈ రాశికి ఆరవ స్థానంలో వక్ర కుజుడి సంచారం వల్ల జీవిత భాగస్వామితో సహా పలువురితో అకా రణ వివాదాలు, విభేదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు కలగడానికి అవకాశం ఉంది.