Kia discount: కియా కార్లపై బంపర్ ఆఫర్.. ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ ప్రకటన

Kia discount: కియా కార్లపై బంపర్ ఆఫర్.. ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ ప్రకటన


మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్ ఇప్పటికే ఈ దారిలో నడుస్తున్నాయి. తాజాగా కియా మోటార్స్ కూడా వచ్చింది. ఆ కంపెనీకి చెందిన సోనెట్, సెల్టోస్, కేరెన్స్ కార్లపై డిస్కౌంట్ అందిస్తోంది. మన దేశంలో పండగల సీజనలో వాహనాలు విక్రయాలు జోరుగా సాగుతాయి. వినాయక చవితి, దసరా, దీపావళి సమయంలో వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఈ సంప్రదాయం చాాలా ఏళ్లుగా వస్తోంది. ఇటీవల ముగిసిన దీపావళి సీజన్ లో కొనుగోలుదారులతో కార్ల మార్కెట్ కిటకిటలాడింది. పలు కంపెనీలు డిస్కౌంట్లను ప్రకటించడంతో అమ్మకాలు చాలా బాగా జరిగాయి. అనంతరం మార్కెట్ సాధారణ పరిస్థితికి చేరింది. ప్రస్తుతం మళ్లీ సంవత్సరాంతపు డిస్కౌంట్లు ప్రకటించడంతో జోరందుకుంటోంది. ఇయర్ ఎండ్ డిస్కౌంట్లను అమ్మకాలు బాగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

  • కియా కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్లు వివిధ మోడళ్లపై వేర్వేరుగా ఉన్నాయి. సోనెట్ కారుకు సంబంధించి ఎక్స్చేంజ్ బోనస్ అందుబాటులో లేదు. అయినా డీలర్ స్థాయి తగ్గింపులతో పాటు రూ.పది వేల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.
  • సెల్టోస్ కారుపై రూ.40 వేల ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. మరో రూ.15 వేల కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఢిల్లీ లో మొదటి ఏడాదికి రూ.1 తోనే సమగ్ర బీమా పొందుతారు.
  • కేరెన్స్ మోడల్ పై రూ.15 వేల కార్పొరేట్ తగ్గింపుతో పాటు ఐదేళ్ల వారంటీ ప్యాకేజీ లభిస్తుంది.
  • కియా కార్లకు మన దేశ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కంపెనీ అనేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కియా సెల్టోస్ ను నవీకరణ చేయనుంది. సరికొత్త డిజైన్, కొత్త ఇంటీరియర్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనుంది. నవీకరణ చేసిన కారు వచ్చే ఏడాది మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.
  • కియా కంపెనీ నుంచి త్వరలో సిరోస్ ఎస్ యూవీ విడుదల కానుంది. పనోరమిక్ సన్ రూఫ్, ఏడీఏఎస్, టెర్రైన్ మోడ్ లు, వైర్ లెస్ చార్జింగ్ తదితర ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఈ కారు డిసెంబర్ 19న దేశంలో విడుదల అవుతుందని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *