Keerthy Suresh: పెళ్లైన మూడు రోజులకే.. మెడలో మంగళసూత్రంతో సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. వీడియో

Keerthy Suresh: పెళ్లైన మూడు రోజులకే.. మెడలో మంగళసూత్రంతో సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. వీడియో


స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. డిసెంబర్‌ 12న తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అంటోని తట్టిల్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. గోవాలో హిందూ సంప్రదాయ ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది. ఇక మూడు రోజుల క్రితమే క్రిస్టియన్‌ పద్ధతిలోనూ ఉంగరాలు మార్చుకుని వెడ్డింగ్‌ సెల్రేషన్స్‌ జరుపుకున్నారీ లవ్లీ కపుల్. అయితే పెళ్లి కనీసం వారం కూడా కాలేదు. అప్పుడే తన సినిమా పనులకు పచ్చ జెండా ఊపింది కీర్తి సురేశ్. మెడలో మంగళసూత్రంతోనే తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసి సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘మహానటి డెడికేషన్ అంటే అలా ఉంటది మరి’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఇప్పటికే దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది కీర్తి సురేశ్. ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె నటించిన మొదటి హిందీ సినిమా బేబీ జాన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లు స్పీడ్ అందుకున్నాయి. హీరో కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈక్రమంలోనే కీర్తి సురేశ్ కూడా బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొంది.

ఇవి కూడా చదవండి

బేబీ జాన్ సినిమా ప్రమోషన్లలో కీర్తి సురేశ్.. వీడియో

కాగా విజయ్ నటించిన తేరీ సినిమాకు హిందీ రీమేక్ గా బేబీజాన్ సినిమా తెరకెక్కింది. ఒరిజినల్ ను తెరకెక్కించిన అట్లీ కుమార్ నే ఈ హిందీ రీమేక్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ స్వరాలు సమకూర్చాడు.

కీర్తి సురేశ్ పెళ్లి  వేడుకల్లో దళపతి విజయ్..

క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో ఉంగరాలు మార్చుకున్న కీర్తి సురేశ్- అంటోని తట్టిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *