పెళ్లయ్యాక సినిమా ఇండస్ట్రీకి దూరమైనవాళ్లు చాలా మంది ఉన్నారు. పెళ్లయ్యాక కొంత మంది సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటే మరికొందరు పెళ్లి, పిల్లలైనా సినిమాలు చేస్తున్నారు. అలియా భట్, ఐశ్వర్యారాయ్ వంటి నటీమణులు పెళ్లి తర్వాత కూడా చిత్ర పరిశ్రమలో విజయవంతంగా కొనసాగిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. అయితే మహానటి కీర్తి సురేష్ ఇప్పుడు ఏ మార్గాన్ని ఎంచుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ‘రివాల్వర్ రీటా’, ‘కన్నీవేది’ సినిమాలు ఉన్నాయి. దీంతో పాటు ‘బేబీ జాన్’ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే వీటి తర్వాత కీర్తి తన కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. ఇదే ఇప్పుడు పలు సందేహాలకు తావిస్తోంది. నటన నుంచి కీర్తి బ్రేక్ తీసుకుంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ఇది కేవలం రూమర్ మాత్రమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లయిన కొద్ది రోజులకే కీర్తి సురేష్ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లింది. సినిమాపై ఆమెకున్న ప్రేమను ఇది తెలియజేస్తుంది. ఆంటోని కూడా కీర్తి సురేష్ సినిమా కెరీర్‌కు అండగా ఉంటాడని కోలీవుడ్ మీడియా చెబుతోంది.
మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్ కు సినీ పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె వివాహం చేసుకుంది. అయితే ఇది కీర్తి సినిమా కెరీర్ పై ఏ మాత్రం ప్రభావం చూపదని తెలుస్తోంది. అలియా భట్, ఐశ్వర్య సహా చాలా మంది నటీమణులు పెళ్లి తర్వాత కూడా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. కీర్తి సురేష్ కూడా వీరి బాటలోనే నడుస్తుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
కాగా ఇప్పటికే దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కీర్తి సురేశ్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె నటించిన మొదటి హిందీ సినిమా బేబీ జాన్ క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.
బేబీ జాన్ సినిమాలో కీర్తి సురేశ్..
The love anthem of the year Is here to make your hearts sing! 💕#HazaarBaar – song out now.
🔗: https://t.co/678niXsAyF
A @MusicThaman musical#BabyJohn will see you in the cinemas this Christmas, on Dec 25.#JyotiDeshpande @MuradKhetani @priyaatlee @Atlee_dir @Varun_dvn… pic.twitter.com/l7jk3rCJfE
— Jio Studios (@jiostudios) December 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.