తమిళ్ స్టార్ సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కంగువ. నవంబర్ 14న కంగువ సినిమా విడుదలైంది. సూర్య సినిమా 2022 నుంచి థియేటర్లలో విడుదల కాలేదు. అందుకే ఆయన అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఉత్కంఠగా ఎదురుచూశారు. విడుదలకు ముందు ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీతో పాటు అనేక భాషల్లో విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమా భారీ హైప్ ను క్రియేట్ చేసింది. కానీ సినిమా విడుదలైన తర్వాత సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది.ఈ సినిమా సౌండింగ్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. సౌండ్ ఎక్కువగా ఉండటంతో సినిమా గందరగోళంగా ఉంది అని చాలా మంది విమర్శించారు.
ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ..! ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..! ఒకప్పటి డ్రీమ్ గర్ల్‌ను గుర్తుపట్టరా.?
సూర్య హీరోగా సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ ఈనెల 14న థియేటర్లలో విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన టాక్ కోలీవుడ్ లో వైరల్ అవుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యింది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన వస్తుంది. ఇదిలా ఉంటే కంగువ సినిమాలో చాలా మంది నటించారు. ఇక కంగువ సినిమాలో నటించిన ఓ నటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :Jagapathi Babu: నువ్వంటే నాకు ఇష్టం లేదు.. స్టార్ హీరోయిన్ ముఖంమీదే చెప్పిన జగపతి బాబు.
పై ఫొటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా.? కంగువ సినిమాలో గిరిజన యువతిగా నటించింది. కంగువ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు కనిపించారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు మీనా వాసు. తెలుగులో పలు సీరియల్స్ లో నటించింది మెప్పించింది. అలాగే చాలా సినిమాల్లోనూ నటించింది ఈ చిన్నది. కంగువ సినిమాలో ఆమె చిన్న పాత్రలోనే కనిపించినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.