మార్కెట్ రావడం గొప్ప కాదు.. వచ్చిన మార్కెట్‌ను నిలబెట్టుకోవడమే గొప్ప. ఇప్పుడదే చేస్తున్నారు ప్రభాస్. అది ఇండియాలో అయినా.. ఓవర్సీస్లో అయినా.. ఒకసారి తనకొచ్చిన మార్కెట్‌ను వదిలే సమస్యే లేదంటున్నారు రెబల్ స్టార్.
అందుకే కల్కి కోసం ఏకంగా ఖండాలు దాటేస్తున్నారు. దేశం కాని దేశానికి టీం అంతా కలిసి వెళ్తున్నారు. తెలుగు హీరోలు కేవలం టాలీవుడ్‌కు మాత్రమే సొంతం కాదు. సౌత్ టూ నార్త్ మనోళ్లదే హవా.
దానికి ముహూర్తం పెట్టింది కూడా ప్రభాసే. అందుకే మిగిలిన వాళ్ల కంటే రెండాకులు ఎక్కువే చదివాడు రెబల్ స్టార్. ఇండియాతో పాటు ఇప్పటికే ఓవర్సీస్లోనూ అదరగొడుతున్నారు ప్రభాస్.
ముఖ్యంగా జపాన్‌లోనూ ప్రభాస్ పేరు మార్మోగిపోతుంది. బాహుబలితో ఇండియాలోనే కాదు.. జపాన్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఆ తర్వాత సాహో, సలార్ సైతం జపాన్‌లో మంచి వసూళ్లనే సాధించాయి.
తాజాగా కల్కిని సైతం జపాన్‌లో భారీగానే రిలీజ్ చేయబోతున్నారు. జనవరి 3న ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. దీనికోసం టీం అంతా అక్కడికి వెళ్లబోతున్నారని తెలుస్తుంది.
కల్కి పార్ట్ 2 కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారు నాగీ. ఈ లోపే కల్కి జపాన్ రిలీజ్‌కు రెడీ అయింది. డిసెంబర్ చివరి వారంలో కల్కి టీమ్ జపాన్ వెళ్లి.. ప్రమోషన్స్ చేస్తారని తెలుస్తుంది.
గతంలో ట్రిపుల్ ఆర్ కోసం జపాన్‌కు ప్రమోషనల్ టూర్ వెళ్లారు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి. అది సినిమాకు బాగా హెల్ప్ అయింది. మరిప్పుడు కల్కికి ఏం జరుగుతుందో చూడాలిక.