ప్రపంచంలోని వివిధ దేశాలకు సొంత సంప్రదాయాలు, విభిన్న వంటకాలు ఉన్నాయి. అటువంటి దేశాలకు చెందిన కొన్ని వంటకాలను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల వారు ఇష్టపడతారు. చైనా స్ప్రింగ్ రోల్స్, ఇటలీ పిజ్జా, జపాన్ సుషీ వంటివి. అయితే జపాన్‌లో సుషీ మాత్రమే కాదు.. చాలా ఇష్టపడే పానీయం కూడా ఉంది. ఈ పానీయానికి యునెస్కో బుధవారం సాంస్కృతిక వారసత్వ హోదాను ఇచ్చింది. దీన్ని బట్టి జపాన్ పానీయం ఎంత ప్రసిద్ధి చెందిందో.. ఎంత మంది ఎంతగా ఇష్టపడుతున్నారో ఊహించవచ్చు.
అవును జపాన్ లోని ఈ ప్రసిద్ధ పానీయం పేరు ‘సాకే’. ఈ పానీయం యునెస్కో నుంచి సాంస్కృతిక వారసత్వ హోదా జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ జపాన్ కు చెందిన సాక్ డ్రింక్ ని చాలా ఇష్టపడతారు. అక్కడ జరిగే చాలా ఈవెంట్లలో ఈ డ్రింక్ తప్పనిసరి. దీనిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. దీనిని తాగడానికి ఓచోకో (చిన్న గాజు)ని ఉపయోగిస్తారు. ఒక్క సిప్‌లో సాకే ను తాగేస్తారు.
సాకే పానీయం ఎలా తయారు చేస్తారంటే
సాకే డ్రింక్ అనేది ఒక రకమైన మద్యం. దీని తయారీకి జపాన్‌కు చెందిన బ్రౌన్ రైస్‌ని ఉపయోగిస్తారు. దీనిని తయారుచేయడానికి.. బియ్యం పై పొర తొలగిస్తారు. దీని తరువాత బియ్యాన్ని కడుగుతారు. బియ్యాన్ని కడిగిన తర్వాత ఆ బియ్యాన్ని పులియబెడతారు. ఈ మొత్తం ప్రక్రియ తర్వాత ఆల్కహాల్ పులిసిన బియ్యానికి జోడిస్తారు.
ఇవి కూడా చదవండి
జపనీస్ ‘సాకే’ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
జపనీస్ సాకే డ్రింక్.. ఒక రకమైన మద్యం. అయితే ఈ మద్యాన్ని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సాకే డ్రింక్ లో అధిక మొత్తంలో అడెనోసిన్ ఉంటుంది, ఇది రక్త నాళాల సంకోచాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో గ్లుటామైడ్ ఆమ్లం, అర్జినిన్ ఉన్నాయి. ఇది రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీనిలో లభించే పెప్టైడ్స్ రక్తపోటు, మధుమేహాన్ని సమతుల్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. దీనితో పాటు ఈ డ్రింక్ ను తాగడం వల్ల చర్మానికి గ్లో వస్తుంది. చర్మం రంగు మారకుండా చేస్తుంది. జపాన్‌లో ఇది చాలా ఇష్టపడటానికి.. ఎక్కువగా ఈ డ్రింక్ ప్రజాదరణ పొందటానికి ఇదే కొన్ని కారణాలు అని చెప్పవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..