భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వరుస రాకెట్ ప్రయోగాలను చేపట్టడమే గాక ఎప్పటికప్పుడు సరికొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త తరహాలో రాకెట్ ప్రయోగాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇటీవలే పీఎస్ఎల్వీ సీ 59 ప్రయోగం ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రయోగం జరిగిన 20 రోజుల్లోనే మరో ప్రయోగానికి ఏర్పాట్లు ఇస్రో పూర్తి చేసింది. ఈనెల 5న జరిగిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం కమర్షియల్ ప్రయోగం అయితే.. తాజాగా స్వదేశీ ప్రయోజనాల కోసం కీలకమైన మిషన్ చేపట్టేందుకు ఇస్రో సిద్ధమైంది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన 400 కేజీలు బరువు కలిగిన స్పెడక్స్ అనే జంట ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్త ఆర్బిట్‌లోకి పంపేందుకు శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఈనెల 30న రాత్రి 9:48 నిమిషాలకు PSLV.. C60 రాకెట్ ప్రయోగం ద్వారా SPEDEX అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు షార్‌లోని మొదట లాంచ్ ప్యాడ్ వద్ద యుద్ధ ప్రాతిపదికన రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేస్తున్నారు. పీఎస్ఎల్వీ సీ 60 రాకెట్ ద్వారా ఈ మిషన్ చేపడుతోంది ఇస్రో..
SPEDEX అనే జంట ఉపగ్రహాలను ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన కక్ష్యలో కాకుండా సరికొత్త ఆర్బిట్ (Renday jous)లోకి ఈ సాటిలైట్‌ను ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు..
ఈ ఉపగ్రహం ద్వారా సరికొత్త విలువైన సమాచారంతోపాటు భవిష్యత్తులో జరిగే స్పేస్ స్టేషన్ నిర్మాణంలో పరిశోధనలు చేపట్టడం అలాగే డాకింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో కీలకంగా దోహదపడుతుంది. స్పేస్ షటిల్ నుంచి డాకింగ్(అనుసంధానం) ఆన్ డాకింగ్ పరీక్షలు చేపట్టనున్నారు. అందుకోసమే 200 కిలోల బరువున్న జంట ఉపగ్రహాలతో లింక్.. అన్ లింక్ పరీక్షలు చేపట్టనున్నారు. ఈ డాకింగ్ అన్ డాకింగ్ సిస్టం ఎలా ఉంటుంది అంటే.. హాలీవుడ్ స్పేస్ రిలేటెడ్ సినిమాల్లో అంతరిక్షంలో ఉండే స్పేస్ సెంటర్‌కు వెళ్లే స్పేస్ షటిల్ దగ్గరకు వెళ్లాక వలయాకారంలో ఉండే డోర్ తెరుచుకుంటుంది ఆ రెండు డోర్లు ఓపెన్ అయ్యాక స్పేస్ సెంటర్ తో విమగాములు వెళ్ళిన వాహన నౌక లింక్ అవుతుంది. ఆ లింక్ అయ్యే టెక్నాలజీని ప్రస్తుతం భారత్ సొంతంగా రూపొందించింది. భవిష్యత్తులో భారత్ అంతరిక్షంలో స్పేస్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం, భారత్ తొలి మ్యాన్ మిషన్ గగన్ యాన్ కోసం కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అలాగే అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల స్థితిగతులను తెలుసుకునే సరికొత్త టెక్నాలజీ కోసం ఈ ప్రయోగం దోహదపడుతుంది. ఈ ప్రయోగంతో 99 రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసిన ఘనత ఇస్రోకు దక్కుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి