Indian 3: ఓటీటీలోభారతీయుడు 3! అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్ శంకర్

Indian 3: ఓటీటీలోభారతీయుడు 3! అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్ శంకర్


దర్శకుడు శంకర్‌కు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల క్రితమే సంచలన సినిమాలను తెరకెక్కంచి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. అయితే ఇటీవల శంకర్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడీ స్టార్ డైరెక్టర్. ఈ సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన అతను తన క్రేజీ ప్రాజెక్టు గురించి మరొకసారి చెప్పుకొచ్చాడు. కాగా ‘ఇండియన్ 3’ సినిమా ఓటీటీలో మాత్రమే విడుదలవుతుందని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే అది అబద్ధమని ఆయన స్పష్టం చేశాడు శంకర్. సాధారణంగా సినిమా ఫ్లాప్ అయితే దానికి సీక్వెల్ తీసే సాహసం ఎవరూ చేయరు. అయితే ‘ఇండియన్ 2’కి సీక్వెల్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. దర్శకుడు శంకర్‌ సాహసానికి నిర్మాతలు కూడా సపోర్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా విడుదలకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘ఇండియన్ 2’ పరాజయం తర్వాత కూడా శంకర్ ‘ఇండియన్ 3’ని ప్రకటించాడు. అయితే ఇండియన్ 2 రిజల్ట్ తో దీనిని నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు రూమర్లు వినిపించాయి.

తాజాగా ఇండియన్ 3 సినిమాపై స్పందించిన శంకర్.. ‘ఇండియన్ 2 చిత్రానికి ఇంత నెగిటివ్ రివ్యూలు వస్తాయని అసలు అనుకోలేదు. అందుకే గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇండియన్ 3ని ముందుగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అది OTTకి వస్తుంది. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌స్తుంద‌న్న‌ది అవాస్త‌వ‌ం’ అని శంకర్ చెప్పుకొచ్చాు. ఈ వార్త విన్న శంకర్, కమల్ హాసన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు శంకర్. ఈ సినిమా సోషియో పొలిటికల్ యాక్షన్ మూవీ. ఆఫీసర్‌, పొలిటీషియన్‌ల మధ్య గొడవలు ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయి. సంక్రాంతి సందర్భంగా సినిమాను వచ్చే జనవరి 10న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *