ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్.. దేశవ్యాప్తంగా ఉన్న ఐపీపీబీ శాఖల్లో రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ ఐటీ, మేనేజర్ ఐటీ, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 10, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
- అసిస్టెంట్ మేనేజర్ ఐటీ పోస్టులు: 54
- మేనేజర్ ఐటీ- (పేమెంట్ సిస్టమ్స్) పోస్టులు: 1
- మేనేజర్ ఐటీ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్ & క్లౌడ్) పోస్టులు: 2
- మేనేజర్-ఐటీ (ఎంటర్‌ప్రైజ్ డేటా వేర్‌హౌస్) పోస్టులు: 1
- సీనియర్ మేనేజర్- ఐటీ (పేమెంట్ సిస్టమ్స్) పోస్టులు: 1
- సీనియర్ మేనేజర్- ఐటీ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్ అండ్ క్లౌడ్) పోస్టులు: 1
- సీనియర్ మేనేజర్- ఐటీ (వెండర్, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్, ఎస్‌ఎల్‌ఏ, పేమెంట్స్) పోస్టులు: 1
- సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)- కాంట్రాక్టు పోస్టులు: 7
పోస్టును అనుసరించి కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్ లేదా కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో పీజీ లేదా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ కోర్సులో బీఈ, బీటెక్ లేదా ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో బీఎస్సీ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు డిసెంబర్ 01, 2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 20 నుంచి 30 ఏళ్లు, మేనేజర్ పోస్టులకు 23 నుంచి 35 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 26 నుంచి 35 ఏళ్లు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులకు 50 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు డిసెంబర్ 21, 2024 నుంచి ప్రారంభం అవుతాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 10, 2025. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.150 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.2,25,937. మేనేజర్‌కు రూ.1,77,146. సీనియర్ మేనేజర్‌కు రూ.1,40,398 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.