నేడు భారత్, వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనునంది. సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా, ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించాయి. నేడు జరిగే మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో గెలిచిన జట్టు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించి 1-1తో భారత్ ఆధిక్యాన్ని సమం చేసింది. దీంతో నేటి మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానునంది.
మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్ మహిళల జట్టు, వెస్టిండీస్ మహిళల జట్టు మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
టైమింగ్స్?
భారత మహిళల జట్టు, వెస్టిండీస్ మహిళల జట్టు మధ్య మూడో T20 మ్యాచ్ IST సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.
టీవీలో ఎక్కడ చూడాలి?
భారత మహిళల జట్టు, వెస్టిండీస్ మహిళల జట్టు మధ్య మూడో టీ20 మ్యాచ్ భారతదేశంలోని స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో ప్రసారం కానుంది.
ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
జియో సినిమా యాప్‌లో భారత మహిళల జట్టు, వెస్టిండీస్ మహిళల జట్టు మధ్య జరిగే మూడో T20 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.
ప్లేయింగ్ ఎలెవన్:
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), నందిని కశ్యప్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సజ్నా సజీవన్, రాఘవి సింగ్ బిస్త్, రేణుకా సింగ్ ఠాకూర్, ప్రియా మిశ్రా, టైటస్ సాధు, సైమా ఠాకోర్, మిన్ను మణి మరియు రాధా యాదవ్.
విండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ క్యాంప్‌బెల్, అలియా అలీన్, షామిలియా కానెల్, నెరిస్సా క్రాఫ్టన్, డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, షబికా ఘజ్నాబి, చినెల్లె హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మినీ మునిస్, అష్మినీ మునిస్సర్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి