IND vs AUS 3rd Test: టీమిండియా టార్గెట్ 275.. ఉత్కంఠగా మారిన గబ్బా టెస్ట్

IND vs AUS 3rd Test: టీమిండియా టార్గెట్ 275.. ఉత్కంఠగా మారిన గబ్బా టెస్ట్


India vs Australia, 3rd Test Day 5: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారత్‌కు 275 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది. కెప్టెన్ పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లేర్ చేశాడు. కంగారూలు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. గబ్బా స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చివరి రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్ 22 పరుగులు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ తలో 2 వికెట్లు తీశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-1తో సమమైంది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

ఇవి కూడా చదవండి

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *