Australia vs India, 3rd Test: భారత క్రికెట్ జట్టు దిగ్గజ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో అతనిపై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ, రోహిత్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. నాల్గవ రోజు ఆట మొదటి అరగంటలో భారత జట్టు వికెట్ కోల్పోయింది. దీంతో టీమ్ ఇండియా తీవ్ర ఒత్తిడికి లోనవడంతో పాటు ఫాలోఆన్ ముప్పును ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మ 27 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు మాత్రమే చేశాడు.
శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ..
మొదటి అరగంటలో భారత బ్యాట్స్‌మెన్స్ ఇద్దరూ బాగా బ్యాటింగ్ చేశారు. ఈరోజు బ్రిస్బేన్‌లో వాతావరణం పూర్తిగా నిర్మలంగా ఉండడంతో బ్యాట్స్‌మెన్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణంగానే రోహిత్, కేఎల్ రాహుల్ మధ్య 30 పరుగుల మంచి భాగస్వామ్యం నెలకొంది. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు టీమ్‌ఇండియాను కష్టాల నుంచి గట్టెక్కిస్తారని, భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పవచ్చని అనిపించినప్పుడు, రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాడు. పాట్ కమిన్స్ వేసిన బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కేఎల్ రాహుల్ అద్భుత అర్ధ సెంచరీ ఇన్నింగ్స్..
ఫాలోఆన్‌ను ఎలా కాపాడుకోవాలనేదే ఇప్పుడు భారత జట్టు ముందున్న పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే 6 వికెట్లు కోల్పోయింది. ఫాలో-ఆన్‌ను కాపాడుకోవడానికి టీమిండియాకు ఇంకా 79 పరుగులు కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాకు ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదం కూడా పొంచి ఉంది. అయితే, కేఎల్ రాహుల్ అద్భుత అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్‌లో ఏ భారతీయ బ్యాట్స్‌మెన్ నుంచి మద్దతు లభించలేదు. ఈ క్రమంలో లంచ్‌కు ముందు కేఎల్ రాహుల్ 84 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో.. మరోసారి టీమిండియా కష్టాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం క్రీజులో జడేజా 41, నితీష్ కుమార్ రెడ్డి 7 పరుగులతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
అంతకుముందు భారత్ టాప్ ఆర్డర్ ఘోరంగా పతనమైంది. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు ఏమాత్రం ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో మ్యాచ్‌లో ఓటమి ప్రమాదం టీమిండియాకు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసుకు దూరమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..