Hyderabad: జాగ్రత్తండోయ్.. ఆ టీ తాగితే క్యాన్సర్ కన్ఫామ్…

Hyderabad: జాగ్రత్తండోయ్.. ఆ టీ తాగితే క్యాన్సర్ కన్ఫామ్…


కాచిగూడలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తి టీ పౌడర్ తయారు చేస్తున్న బండారం ఫుడ్ సేఫ్టీ  అధికారుల బృందం ఆకస్మిక తనిఖీతో బయటపడింది. కిలో కాదు రెండు కిలోలు కాదు, ఏకంగా నాలుగు క్వింటాళ్ల కల్తీ చాయ్ పత్తిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని అధికారుల అంచనా. ఈ కల్తీ చాయ్ పత్తి మాఫియా గ్యాంగ్ లీడర్..  మహేష్ గిరి అనే వ్యక్తి అని ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు.

కాచిగూడలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని మహేష్ గిరి… మరికొందరిని కలుపుకొని ఈ కల్తీ టీ పొడి దందాకు తెర తీశారు. బేగంబజార్‌లో చాయ్ పత్తిని కొన్న తర్వాత కాచిగూడలోని అద్దె ఇంట్లోకి తీసుకొచ్చి అందులోని కొన్ని పదార్థాలను మిక్స్ చేసి ఫుట్ పాతులపై ఉండే ఛాయ్ దుకాణాలకు ఈ టీ పొడిని అమ్ముతున్నారు. దీనిలో క్యాన్సర్ కారకమైన క్యాసినోజెనిక్ అనే పదార్థం ఉన్నట్లుగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు.

ఈ టీ పొడిని టిష్యూ పేపర్ పైన వేసి దానిపై తాగే నీరు వేసినప్పుడు పేపర్ మొత్తం రెడ్ కలర్‌గా మారిపోయింది. సాధారణంగా టీ పొడిపై నీరు పోసినప్పుడు ఎలాంటి కలర్లు విడుదల చేయదు అన్నది ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న మాట… ఇంటిలో తయారు చేస్తున్న దాదాపు నాలుగు క్వింటాళ్ల టీ పొడిని అధికారులు సీజ్ చేశారు. ఈ కల్తీ దందాకు పాల్పడిన మహేష్ గిరికి నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేశారు. కల్తీ చాయ్ పత్తి శాంపిల్స్ సేకరించి నాచారంలోని ఫుడ్ సేఫ్టీ స్టేట్ లాబరేటరీకి పంపించారు.

ఈ మ్యాటర్ చదివిన మీ అందరికీ టీవీ9 సూచన… ఎప్పుడైనా ఎక్కడన్నా టీ తాగే దగ్గర డౌట్ వస్తే మాత్రం ఛాయ్ పత్తిని వైట్ టిష్యూ పేపర్‌పైన వేసి దానిపై తాగే నీరు వేస్తే కలర్ మారితే అది కన్ఫామ్‌గా కల్తీ చాయ్ పత్తి అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *