దిన ఫలాలు (డిసెంబర్ 16, 2024): మేష రాశి వారు ఈరోజు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు పెరగడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా, ప్రాధాన్యం పెరిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయపరంగా రోజు బాగానే గడిచిపోతుంది. ఇంట్లోకి ధన ప్రవాహం ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం ఆశించిన స్థాయిలో సాగిపోతుంది. వ్యాపారాలు లాభాలపరంగా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. వృక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో బాగా లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. రావలసిన సొమ్మును కొద్ది శ్రమతో రాబట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
కష్టార్జితాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. నష్టదాయక వ్యవహారాల మీద ఖర్చు పెట్టి ఇబ్బంది పడతారు. షేర్లు, స్పెక్యులేషన్లు లాభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా, ప్రాధాన్యం పెరిగే సూచనలున్నాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజా వుగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయాన్ని పెంచడానికి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపా రాలు మరింత లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసు కుంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభి స్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆశించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ఆదాయం బాగానే పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి కానీ, ఆర్థిక లావాదేవీ లకు, అనవసర సహాయాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంతో ఆలయాలు సందర్శి స్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం లేదా హోదా పెరుగుతుంది. అధికారులు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు మీ సేవలను అతిగా ఉపయోగించుకుం టారు. కుటుంబంలో కూడా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఆఫర్ లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగులకు బాధ్యతలు మారడం గానీ, బదిలీ కావడం గానీ జరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలకు, లావాదేవీలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలను ఆర్జిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు పని భారం కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అదనపు ఆదాయం మీద శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆశించిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురు తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో మీ ప్రతిభకు, సమర్థతకు సరైన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి పొందే అవకాశంఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చేసుకుంటాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు కొన్ని అనుకూల వార్తలు వింటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల వల్ల ఆస్తి వివాదం ఒకటి పరి ష్కారం అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.