ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుందంట.. ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుందంటూ ఇండస్ట్రీలో నిన్నమొన్నటి వరకు వార్తలొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికీ కోటి రూపాయల పారితోషికం అందట్లేదు. ఇందులో నిజమెంత? సినీ ఇండస్ట్రీలో నటీమణులు.. సినిమాల ద్వారా కొన్ని లక్షలు సంపాదించేవారు. ఇక స్టార్ హీరోయిన్లు మాత్రం కోట్లలో పారితోషికం తీసుకోవడం మొదలుపెట్టారు. సినిమా థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకోవడం, ఆ పై ఓటీటీలో ప్రసారం కావడం జరిగేవి. సమంత, ప్రియాంకా చోప్రా ఇంకా చాలా మంది నటీమణులు నటించిన వెబ్ సిరీస్‌లు మంచి ఆదరణ పొందాయి. ఆ విధంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో సహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రముఖ నటీమణులకు భారీ రెమ్యూనరేషన్ చెల్లించాయి.
ఓటీటీలో భారీ పారితోషికం అందుకున్న బాలీవుడ్ స్టార్ గా సిటాడెల్ లో నటించిన ప్రియాంక చోప్రా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. భారతీయ కరెన్సీలో చూస్తే రూ. 2000 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు సిటాడెల్ సిరీస్ కోసం. దీని కోసం తొలిసారిగా ప్రియాంక.. అందులో నటించిన హాలీవుడ్ హీరో హీరో రిచర్డ్ మాడెన్‌కు సమానంగా పారితోషికం అందుకుంది. అంటే 25-30 మిలియన్ల డాలర్లు అందుకుందని అంతర్జాతీయ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అంచనా వేశాయి. అంటే ప్రియాంక ఈ ఒక్క సిరీస్ కే దాదాపు 200 కోట్లకు పైగా పారితోషికం అందుకుందన్న మాట. ప్రియాంక కంటే ముందు అజయ్ దేవగన్ డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయిన రుద్ర వెబ్ సిరీస్ కోసం రూ.125 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుని భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఓటీటీ స్టార్ గా నిలిచారు. అలాగే కరీనా కపూర్ జానే జాన్ సినిమాకు 12 కోట్లు, అలియా భట్ డార్లింగ్స్ కోసం 15 కోట్లు వసూలు చేశారు. సైఫ్ అలీ ఖాన్ వెబ్ సిరీస్ కోసం రూ.25 కోట్ల పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. ఇతర నటీనటులు ఓటీటీలో రూ.10 నుంచి 15 కోట్లు అందుకున్నారు. ఉదాహరణకు మనోజ్ బాజ్‌పేయి ది ఫ్యామిలీ మ్యాన్ కోసం రూ.10 కోట్లు అందుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సడన్‌గా పడిపోయిన ఓటిటి రైట్స్ ప్రభావం.. హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తోంది. నాన్ థియెట్రికల్ బూమ్‌లో ఉన్నపుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు. కానీ ఓటిటి స్ట్రీమింగ్‌కి ముందున్నంత డిమాండ్ లేదిప్పుడు. పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ఫ్రీ కంటెంట్ వైపు వెళ్తుంది. దీంతో నాన్ థియెట్రికల్ సేలబుల్ కాకపోవడంతో హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశీ ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటిటిలోనూ పెద్దగా కనిపించట్లేదిప్పుడు. కరోనా టైమ్‌లో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటిటి వైపు వెళ్లారు. కానీ డిజిటల్ మార్కెట్ దారుణంగా పడిపోయిందిప్పుడు. ముందులా రైట్స్ సేల్ అవ్వట్లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్లేమో ఒక్క సీజన్‌కే పరిమితమవుతున్నారు. ఏ హీరోయిన్‌కు స్టాండర్డ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, తమన్నా ముందులా మెరవట్లేదు. అందుకే ఒకప్పట్లా హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధపడడం లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.