Gemini 2.0: ఏఐ జెమినీ 2.0 రిలీజ్‌ చేసిన గూగుల్‌.. ఇక ఆ సమస్యలకు చెక్‌

Gemini 2.0: ఏఐ జెమినీ 2.0 రిలీజ్‌ చేసిన గూగుల్‌.. ఇక ఆ సమస్యలకు చెక్‌


గూగుల్ తన ఏఐ అప్‌డేటెడ్‌ జెమిని 2.0ని ప్రారంభించింది. ఈ కొత్త మోడల్ మంచి పనితీరు, మల్టీ టాస్కింగ్‌, వినియోగ అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. జెమినీ 2.0 పవర్డ్ ఇంటరాక్షన్‌లలో ట్రాన్సఫర్మేటివ్‌ ఫీలింగ్‌ను ఇస్తుందని గూగుల్‌ ప్రతినిధులు చెబుతున్నారు. జెమిని 1.0 సమాచారాన్ని నిర్వహించడంతో పాటు అర్థం చేసుకోవడం గురించి అయితే జెమిని 2.0 న్యూ క్లాస్‌ ఏజెంట్ అని పేర్కొంటున్నారు. మల్టీమోడల్ రీజనింగ్, లాంగ్ కాంటెక్స్ట్ అండర్‌స్టాండింగ్, కాంప్లెక్స్ ఇన్‌స్ట్రక్షన్ ఫాలోయింగ్, ప్లానింగ్, కంపోజిషనల్ ఫంక్షన్-కాలింగ్, లోకల్‌ టూల్ యూసేస్‌ వంటి అప్‌డేట్స్‌తో జెమినీ 2.0 ఆకర్షిస్తుందని వివరిస్తున్నారు. జెమిని 2.0 గత వెర్షన్‌ కంటే రెండింతలు వేగాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మల్టీమోడల్ ప్రాసెసింగ్‌లో అధునాతన సామర్థ్యాలను పరిచయం చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

జెమినీ 2.0 టెక్స్ట్, ఆడియో, వీడియో, ఫొటోలతో సహా వివిధ డేటా రకాల నుంచి అవుట్‌పుట్‌లను అన్వయిస్తుంది. అలాగే రూపొందిస్తుంది కూడా. 1 మిలియన్ టోకెన్‌ల వరకు కాంటెక్స్ట్ విండోను నిర్వహించే జెమినీ 2.0 అందరినీ ఆకర్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జెమిని 2.0 ఏజెంట్ ఏఐను పరిచయం చేసింది. ఏజెంటిక్ ఏఐ అనేది వినియోగదారుల తరపున చొరవ తీసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, విధులను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జెమిని వినియోగదారులు డెస్క్‌టాప్, మొబైల్ బ్రౌజర్‌లలోని మోడల్ మెను నుంచి ఎంచుకోవడం ద్వారా 2.0 యాక్సెస్ చేయవచ్చు. త్వరలో జెమినీ మొబైల్ యాప్‌లో కూడా ఈ వెర్షన్ అందుబాటులోకి రానుంది. డెమిస్ హస్సాబిస్, గూగుల్ డీప్ మైండ్‌కు సంబంధించిన ఏఐ పరిశోధన ల్యాబ్ క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించేలా సిస్టమ్‌లను రూపొందించడంపై దృష్టి సారించింది. జెమిని 2.0 ద్వారా అధునాతన గణిత సమస్యలు, కోడింగ్‌తో సహా మరింత క్లిష్టమైన విషయాలను, మల్టీలెవల్ ప్రశ్నలను నిర్వహించడానికి గూగుల్ ఏఐ ఓవర్‌వ్యూలలో చేర్చాలని గూగుల్ యోచిస్తోంది. జెమినీ 2.0 వచ్చే ఏడాది ప్రారంభంలో మరింత విస్తృతంగా విస్తరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *