US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఓ నివేదిక ప్రకారం.. చలికాలంలో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల జలుబు, ఫ్లూ 63 శాతం తగ్గుతాయని వెల్లడించింది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ రక్త ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడుతుంది.