Game Changer: గెట్టింగ్ రెడీ ఫర్ గేమ్ ‘ఛేంజింగ్’ మూమెంట్ .. రామ్ చరణ్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్

Game Changer: గెట్టింగ్ రెడీ ఫర్ గేమ్ ‘ఛేంజింగ్’ మూమెంట్ .. రామ్ చరణ్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్


టాలీవుడ్ సినీ హిస్టరీలో ఒక సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమవుతోంది. రామ్ చరణ్ తేజ్ హీరోగా ఇండియన్ మోస్ట్ కాస్ట్లీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. దిల్ రాజు, అల్లు శిరీష్ నిర్మాణంలో ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : OTT Web Series : ఓయమ్మో..! ఇదెక్కడి అరాచకం.. మరీ ఇంత బోల్డ్ సిరీసా..!! ఒంటరిగానే చూడాలి

ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ప్రమోషనల్ కంటెంట్ తో మ్యాజిక్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మునుపెన్నడూ లేని విధంగా అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. డిసెంబర్ 21వ తేదీన అంటే మరికొద్ది గంటల్లో ఈ ఈవెంట్ జరగబోతోంది. సాధారణంగా సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ అవి కూడా సినిమా రిలీజయిన తర్వాత మాత్రమే అమెరికాలో చేసేవారు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో నిర్వహించడానికి అంతా రెడీ అయింది.

ఇది కూడా చదవండి :ప్రియుడితో కలిసి చిందులేసిన క్రేజీ బ్యూటీ.. కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు..

గేమ్ చేంజర్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ కల్లేపల్లి ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసి అంతా సిద్ధం చేశారు. హీరో రామ్ చరణ్ తేజ, దర్శకుడు శంకర్ తో పాటు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అలాగే ఈ ఈవెంట్ హోస్ట్ చేయబోతున్న సుమ కూడా ఇప్పటికే డల్లాస్ చేరుకున్నారు. వారు మాత్రమే కాదు ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తేజతో సినిమాలు చేయబోతున్న దర్శకులు బుచ్చిబాబు, సుకుమార్ కూడా ఈ ఈవెంట్ కి హాజరు కావడం కోసం డల్లాస్ చేరుకున్నారు. డల్లాస్ లో రామ్ చరణ్ అభిమానులు వీరికి ఒక రేంజ్ లో వెల్కమ్ చెప్పారు.

ఇది కూడా చదవండి :Year Ender 2024: రేయ్ ఎవర్రా మీరంతా..!! ఈ హీరోయిన్ కోసం గూగుల్‌లో తెగ గాలించారంట మావా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *