Folk Singer Shruthi: పెళ్లై 20 రోజులే.. అనుమాస్పద స్థితిలో ఫోక్ సింగర్ మృతి.. అత్తింట్లో ఏం జరిగింది

Folk Singer Shruthi: పెళ్లై 20 రోజులే.. అనుమాస్పద స్థితిలో ఫోక్ సింగర్ మృతి.. అత్తింట్లో ఏం జరిగింది


ఇటీవలి కాలంలో.. సోషల్ మీడియాలో పరిచయం వెంటనే ప్రేమ..పెళ్లి కట్ చేస్తే గొడవలు.. విడిపోవడం.. చాలా కుటుంబాల్లో ఇది సర్వ సాధారణంగా మారుతోంది.. మరికొంత మంది అయితే ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నారు..ఇలాగే ఓ ఫోక్ సింగర్ ప్రేమాయణం పెళ్లి వరకు చేరింది.. పెళ్లి అయ్యి 20 రోజుల గడవకముందే.. ఆ ఫోక్ సింగర్ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఫోక్ సింగర్ శ్రుతి అనుమానాస్పద స్థితిలో మరణించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతురాలి బంధువుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శ్రుతి (ఫోక్ సింగర్)కి సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.

మృతురాలు శృతి ఒక ప్రముఖ గాయని ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదారాబాద్‌లో ఉండేది. ఇదే క్రమంలో దయాకర్ తో ప్రేమలో పడి తరచూ దయాకర్ స్వగృహం అయిన పీర్లపల్లి గ్రామానికి వస్తూ ఉండేది. కాగా, ఇద్దరి తల్లిదండ్రులను ఓప్పించి వివాహం చేసుకోవాలని చూశారు.. అయితే, శృతి తల్లి దండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోక పోవడంతో, ఇద్దరూ కలిసి గత ఇరవై రోజుల క్రితం దయాకర్ స్వగృహంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి అయిన 20 రోజులకు ఏమైందో ఏమో తెలియదు కానీ, బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోక్ సింగర్ శృతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. హఠాత్తుగా శృతి ఇలా అనుమానాస్పదంగా మృతి చెందటంతో కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు..

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న మృతురాలి బంధువులు బోరున విలపిస్తూ, శ్రుతి ఆత్మహత్య చేసుకోలేదని, తన భర్త, అత్త వాళ్లే శ్రుతిని చంపేశారని ఆరోపిస్తున్నారు. అత్తింటి వేధింపులే కారణమని పేర్కొంటున్నారు..

అసలు శ్రుతి ఎందుకు చనిపోయింది.. అంత కష్టం ఏమోచ్చింది..? కారణాలు ఏంటి అనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయాయి.. శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *