Fennel Seeds for Skin: చవకగా దొరికే ఈ వస్తువుతోనే మీ ముఖాన్ని మెరిపించేయండి..

Fennel Seeds for Skin: చవకగా దొరికే ఈ వస్తువుతోనే మీ ముఖాన్ని మెరిపించేయండి..


అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. నిజం చెప్పాలంటే అందంగా ఉండటం అనేది ఒక ఆర్ట్. అందంగా కనిపించాలంటే చాలా శ్రమ పడాలి. కేవలం ముఖానికి క్రీములు రాస్తే సరిపోదు. చాలా కష్ట పడాలి. మీరు తినే ఆహారంతోనే 70 శాతం అందాన్ని సొంతం చేసుకోవచ్చు. చాలా మంది అందం అంటే ఖరీదైన క్రీములు రాసుకోవడం, బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లడం అనుకుంటారు. కానీ ఆహారంతోనే చాలా వరకు మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉంటే.. మీరు లోపలి నుంచి మరింత అందంగా కనిపిస్తారు. అందాన్ని పెంచుకోవడానికి ఇప్పటికే ఎన్నో రకాల చిట్కాలు తెలుసుకున్నారు. సరదగా మనం తినే సోంపుతో కూడా అందాన్ని పెంచుకోవచ్చని మీకు తెలుసా! మనకు ఎంతో చకవగా లభించే సోంపుతోనే ఎంతో గ్లోయింగ్ స్కిన్‌ని పొందవచ్చు. సోంపుతో చేసే ఈ ప్యాక్ వేసుకుంటే.. చర్మం అందం పెరుగుతుంది. మరి చర్మ అందాన్ని పెంచే ఆ ప్యాక్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

అనేక ప్రయోజనాలు..

చర్మ అందాన్ని పెంచడంలో సోంపు ఎంతో హెల్ప్ చేస్తుంది. చర్మ ఛాయని మెరుగు పరుస్తుంది. పింపుల్సి‌ని కూడా తగ్గించగలదు. మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యను కూడా కంట్రోల్ చేస్తుంది. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి వచ్చే డ్యామేజీ నుంచి రక్షిస్తుంది. చర్మ కణాలపై పేరుకు పోయిన మృత కణాలను తొలగించి.. లైట్‌నింగ్ పెంచుతుంది. యాంటీ ఏజింగ్ క్రీమ్స్‌లో కూడా సోంపు వాడతారు. కాబట్టి సోంపు నీటిని మరిగించి తీసుకున్నా.. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. ముడతలు కూడా రాకుండా చేస్తుంది.

సోంపు బ్యూటీ ప్యాక్:

ఈ ప్యాక్‌ని చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ముందుగా సోంపును మెత్తని పొడిలా చేసి ఓ బౌల్‌లో ఓ స్పూన్ తీసుకోండి. ఇందులో కొద్దిగా తేనె, కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేయాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి రాసి.. ఓ నిమిషం పాటు మసాజ్ చేసి.. పావు గంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు. మంచి గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *