Director Shankar: ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. ప్రభాస్‏తోనూ.. డైరెక్టర్ శంకర్..

Director Shankar: ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. ప్రభాస్‏తోనూ.. డైరెక్టర్ శంకర్..


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో చరణ్ జోడిగా కియారా అద్వాని నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అందులో భాగంగానే డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్, బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు. అదే సమయంలో డైరెక్టర్ శంకర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు హీరోలతో తాను ఇదివరకే సినిమాలు చేద్దామనుకున్నానని… కానీ కుదరలేదని అన్నారు. చివరకు రామ్ చరణ్ తో సెట్ అయ్యిందన్నారు. శంకర్ మాట్లాడుతూ..”ప్రస్తుతం గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాను. అందుకే ఇక్కడకు రావాలా ? వద్దా ? అని ఆలోచించాను. పోకిరి, ఒక్కడ లాంటి మాస్ ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. అందులోనూ నా మార్క్ ఉండాలని కోరుకున్నాను. అదే ఆలోచనతో చేసిందే ఈ సినిమా. తమిళంలో, హిందీలో సినిమాలు చేశారు. కానీ తెలుగులో గేమ్ ఛేంజర్ నా తొలి సినిమా. చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నాను.. కానీ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నాను. కానీ సెట్ కాలేదు. చివరకు కరోనా సమయంలో ప్రభాస్ తో చర్చలు జరిగాయి. అదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా రాసిపెట్టి ఉంది. ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడి మధ్య ఘర్షణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇందులో రామ్ చరణ్ చాలా సెటిల్డ్ గా నటించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ నటనతో మెప్పిస్తారు ” అంటూ చెప్పుకొచ్చాడు శంకర్.

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది.

సినీ ఇండస్ట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌ చేశారు. అల్లూరి జిల్లాలో పర్యటించిన ఆయన.. సినీ పరిశ్రమ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నానన్నారు. సినిమా షూటింగ్‌లకు అందరూ విదేశాలకు పోతున్నారని.. అలా వెళ్లకుండా ఇక్కడే షూటింగ్‌లు చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని విధాలా ఆలోచించే టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు పవన్‌కళ్యాణ్..

సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తా: టీడీపీ ఏపీ అధ్యక్షుడు

మరోవైపు.. సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని పవన్‌కళ్యాణ్‌ కూడా ప్రకటించారన్నారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన్నారు పల్లా శ్రీనివాస్. సంధ్య థియేటర్ ఘటనపై పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ..”తొక్కిసలాటలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ విభాగం పరిస్థితిని ముందే అంచనా వేయాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి. ఫిల్మ్ స్టార్స్‌ సైతం పరిస్థితిని అంచనా వేయగలగాలి అని సూచిస్తున్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లాల్సింది కాదని అన్నారు. ప్రజల ప్రాణాలకు హానీ కల్గకుండా చూడాలి. బాధిత కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాలి” అని అన్నారు.

సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలను అనుమతించబోమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాదిరిగానే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రామకృష్ణ.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *