కాగా గతేడాది రామబాణం సినిమాలో చివరిసారిగా కనిపించింది డింపుల్ హయాతి. ఇందులో గోపీచంద్ హీరోగా కనిపించాడు. అయితే ఈ సినిమా తర్వాత ఎక్కడా కనిపించలేదు డింపుల్
ఈ ఏడాది ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. సోషల్ మీడియాలోనూ ఎలాంటి సినిమా అప్డేట్స్ ఇవ్వడం లేదీ అందాల తార
కాగా ఈ ముద్దుగుమ్మకు ఇటీవలే మేజర్ సర్జరీ జరిగిందట. దీనివల్ల 30 రోజుల పాటు బెడ్ రెస్ట్ కే పరిమితమైందట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.
హార్మోన్ అసమతుల్యత కారణంగా తాను బాగా బరువు పెరిగిపోయానని, దానివల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని ఈ పోస్ట్ లో చెప్పుకొచ్చింది.
అయితే ఈ విషయం తెలియక బరువు తగ్గించుకోవడం కోసం, వర్కౌట్ పేరుతో శరీరాన్ని ఇబ్బంది పెట్టడంతో భుజం నొప్పి, కాలి నొప్పి, నడుము నొప్పి తదితర సమస్యలు కూడా డింపుల్ ఎదురయ్యాయట.