Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటించే పాము.. డ్రామా క్వీన్‌ అంటున్న నెటిజన్లు..

Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటించే పాము.. డ్రామా క్వీన్‌ అంటున్న నెటిజన్లు..


ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పాములు కనిపిస్తాయి. కొన్ని విషపూరిత పాములు కాగా, మరికొన్ని ఎగిరే పాముల వరకు అనేక రకాల పాములను గురించి వింటూనే ఉంటాం. కొన్ని పాముల్ని చూసే ఉంటారు. అయితే ప్రపంచంలోనే ఒక పాము అందరిలో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది అత్యంత నాటకీయమైన పాము. ఇది ఎంతలా యాక్టింగ్‌ చేస్తుందంటే.. ఏకంగా చనిపోయినట్లు నటిస్తుంది. ఈ పాము నటన చూస్తే మీరు స్టన్ అవుతారు. ఎంత ప్రయత్నించినా ఈ పాము నటన మాత్రం ఆపదు.. తనను తాను రక్షించుకోవడానికి చచ్చిపోయినట్లు నటించిన ఈ పాముకు నటనలో ఆస్కార్ ఇస్తే తప్పేమీ కాదు అంటారు మీరు కూడా.. ఈ పాము గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ఈ పాము పేరు హాగ్నోస్ స్నేక్. విషపూరితమైన పాముల్లో ఇది కూడా ఒకటి. హాగ్నోస్ పాము 20 నుండి 30 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ పాము చిన్న కీటకాల నుండి చిన్న పక్షుల వరకు వేటాడుతుంది. చనిపోయినట్లు నటిస్తున్న ఈ పాము ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదైనా జంతువు, ఇతర జీవులు ఏవైనా దానిని తాకినట్లయితే వెంటనే అది చనిపోతుంది. చనిపోయినట్లు నటిస్తుంది.. రక్తం కక్కుతూ, దుర్వాసనతో కూడిన మలంను శరీరంలో నుంచి రిలీజ్ చేస్తుంది. భరించలేని కొన్నిరకాలు రసాయనాలను కూడా బయకు విడుదల చేస్తుంది. దీన్ని చూసి అవతలి జీవులు ఈ పాములు చనిపోయాయని భావిస్తాయి.

హాగ్నోస్ పాములు పసుపు, గోధుమ, బూడిద, ఆలివ్, నలుపు రంగులో ఉంటాయి. కొన్ని పాములకు కళ్ల వెనుక నల్లటి మచ్చలు ఉంటాయి. కొన్ని పాముల వెనుక ముదురు గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఆడ హాగ్నోస్ పాములు సాధారణంగా మగ పాముల కంటే పెద్దవి. హాగ్నోస్ పాములు దాదాపు 10-15 సంవత్సరాలు జీవించగలవు. అయితే, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..హాగ్నోస్‌ పాముల విషం మానవులపై ఎటువంటి ప్రభావం చూపదని అంటున్నారు. దాని కాటుతో మనిషి చనిపోడు. అయితే కాసేపటి వరకు మంటగా అనిపిస్తుంది. ఇది తేలికపాటి విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది దవడ వెనుక ఉన్న రెండు దంతాల నుండి విషాన్ని వెలికితీస్తుంది. కానీ, చాలా అరుదుగా కాటేస్తుందట.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

Hognose snake theatrically fakes death to avoid predation
by inDamnthatsinteresting

హాగ్నోస్ పాముకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఓ వీడియోలో ఓ వ్యక్తి పామును తన చేతితో తాకినప్పుడు.. అది వెంటనే పడిపోతుంది. అతడు ఆ పాముని ఎన్నిసార్లు తిప్పినా అది తలకిందులుగా పడిపోతుంది. పైగా నాలుక బయటకు పెట్టి చనిపోయినట్లు నటిస్తుంది. ఇంటర్‌నెట్‌లో వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *