Dattatreya Jayanti: దత్తాత్రేయ జయంతి, శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యతను తెలుసుకోండి..

Dattatreya Jayanti: దత్తాత్రేయ జయంతి, శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యతను తెలుసుకోండి..


త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపం దత్తాత్రేయుడు. హిందూ క్యాలెండర్ ప్రకారం దత్తాత్రేయ భగవానుడి జన్మదినం మార్గశిర మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దత్తాత్రేయ మార్గశిర పౌర్ణమి రోజున జన్మించాడని మతపరమైన నమ్మకం. దత్తాత్రేయలో భగవంతుడు, గురువు రెండు రూపాలు ఉన్నాయి. అందుకే ఆయనను శ్రీ గురువు అని కూడా అంటారు. శ్రీ మద్ భగవత గ్రంథాల ప్రకారం దత్తాత్రేయుడు 24 మంది గురువుల నుంచి విద్యను పొందాడు. పురాణ శాస్త్రాల ప్రకారం దత్తాత్రేయ పుట్టిన రోజున పూజలు చేయడం, ఉపవాసం ఉండటం వల్ల భక్తుల కోరికలు నెరవేరతాయి.

దత్తాత్రేయ జయంతి పూజ శుభ సమయం 2024

వేద క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసం పౌర్ణమి డిసెంబర్ 14 సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ 15 మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. అందుకే డిసెంబర్ 14న దత్తాత్రేయ జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. దత్తాత్రేయ భగవానుని ఆరాధన సంధ్యా సమయంలో చేస్తారు. కనుక పూజకు శుభ సమయం సాయంత్రం 5.23 గంటలకు ప్రారంభమై 5.51 గంటలకు ముగుస్తుంది.

దత్తాత్రేయ జన్మదినోత్సవ పూజ విధి

దత్తాత్రేయ జన్మదినోత్సవం రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత ఉపవాసం, పూజలు చేస్తానని ప్రతిజ్ఞ చేయాలి. సాయంత్రం ఒక వేదికపై ఎర్రటి వస్త్రాన్ని పరచి దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించండి. అనంతరం విగ్రహానికి గంగాజలంతో స్నానం చేయించండి. ముందుగా తెల్ల గంధం, కుంకుమతో దత్తాత్రేయుడికి కుంకుమ దిద్దండి. తరువాత పువ్వులు, పువ్వుల మాల సమర్పించండి. స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే ఈ రోజు ఉపవాసం పాటించే భక్తులు తులసి దళాలు, పంచామృతాలను స్వామికి సమర్పించండి. దీని తరువాత చివరగా హారతి ఇవ్వండి. పూజలో ఏదైనా తెలిసి తెలియక చేసిన పొరపాట్లను క్షమాపణ చెప్పండి.

ఇవి కూడా చదవండి

దత్తాత్రేయ జన్మదినోత్సవం రోజున ఈ మంత్రాలను జపించండి

దత్తాత్రేయ జన్మదినోత్సవ రోజున పూజ సమయంలో ఈ మంత్రాన్ని జపించండి. వీలైతే ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. అంతేకాదు మంత్రాలను పఠించడానికి రుద్రాక్ష మాలను ఉపయోగించండి.

ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ।

ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః !! ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త: ప్రచోదయాత్ !!… ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః

దిగంబర-దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా. ఓం హ్రీం విద్యుత్ జీవ మాణిక్య రూపిణే స్వాహా ।।

దత్త గాయత్రీ మంత్రం

ఓం దత్తాత్రేయ విద్మహే దిగంబరాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్

దత్తాత్రేయ జన్మ దినోత్సవం ప్రాముఖ్యత

పురాణ శాస్త్రాల ప్రకారం దత్తాత్రేయ భగవానుడికి మూడు ముఖాలు ఉన్నాయి. అతని తండ్రి అత్రి మహర్షి, తల్లి అనుసూయ. దత్తాత్రేయుడి మూడు చేతులు, మూడు ముఖాలు ఉన్నాయి. దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషం లభిస్తుంది. దత్తాత్రేయ భగవానుడు ప్రకృతి, మానవులు, జంతువులు, పక్షులతో సహా ఇరవై నాలుగు గురువులను సృష్టించాడు. పుట్టిన రోజున దత్తాత్రేయుడిని పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల శీఘ్ర ఫలితాలు లభిస్తాయని.. భక్తులకు కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *