Daku Maharaaj: ఇలా చేస్తే.. బాలయ్యను కలిసే బంపర్ ఆఫర్ అందుకోవచ్చు.. ఇంతకూ ఏం చెయ్యాలంటే

Daku Maharaaj: ఇలా చేస్తే.. బాలయ్యను కలిసే బంపర్ ఆఫర్ అందుకోవచ్చు.. ఇంతకూ ఏం చెయ్యాలంటే


నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు బాలయ్య. అఖండ సినిమా నుంచి మొదలు పెట్టి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న నటసింహం.. ఇప్పుడు డాకు మహారాజ్‌గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న బాబీ డైరెక్షన్‌లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్‌తో ప్రేక్షకుల అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారు.

ఇది కూడా చదవండి :అప్పుడు బాడీ షేమింగ్ అవమానాలు.. ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే సోయగం.. స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ

పవర్ ఫుల్ కథతో డాకు మహారాజ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బాబీ. సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా మరోసారి ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్  కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు చాందిని చౌదరి కూడా కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.  సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇది కూడా చదవండి :Venu Swamy: నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.. ఇంకా జరుగుతాయి

కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న అమెరికాలోని టెక్సాస్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.దాంతో ఈ ఈవెంట్ కోసం అమెరికాలో ఉన్న బాలయ్య అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈవెంట్‌కు వెళ్లే అభిమానుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆహా గోల్డ్‌ను ఈ నెల( డిసెంబర్) 31లోగా సబ్‌స్క్రైబ్ చేసుకుంటే డాకు మహారాజ్ ఈవెంట్‌ను లాంజ్‌లో కూర్చొని చూసే అవకాశంతో పాటు బాలకృష్ణను కలిసే అవకాశాన్ని కూడా పొందొచ్చు.. మరెందుకు ఆలస్యం ఆహ గోల్డ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.. డాకు మహారాజ్‌ను కలుసుకోండి..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

Daku Maharaj

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *