D-Mart vs Vishal mart: ఈ వ్యాపార సంస్థల్లో ఏది బెస్ట్.. డీమార్ట్, విశాల్ మార్ట్ మధ్య తేడాలివే..!

D-Mart vs Vishal mart: ఈ వ్యాపార సంస్థల్లో ఏది బెస్ట్.. డీమార్ట్, విశాల్ మార్ట్ మధ్య తేడాలివే..!


దేశంలోని అనేక చోట్ల వీటికి బ్రాంచ్ లున్నాయి. అయితే ఇటీవల విశాల్ మార్ట్ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించింది. వ్యాపార రంగంలో పోటీపడుతున్న ఈ రెండు సంస్థల గురించి తెలుసుకుందాం. అవెన్యూ సూపర్ మార్ట్ (డీమార్ట్) స్టాక్ విలువ రూ.2.2 లక్షల కోట్లు కాగా, విశాల్ మార్ట్ రూ.35,200 కోట్లతో కొనసాగుతోంది. దీనితో పోల్చితే డీమార్డ్ దే మార్కెట్ లో ఆధిపత్యం. దాని ఆర్థిక గణాంకాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. మొత్తం ఆదాయం, నికర లాభం కూడా విశాల్ మార్ట్ కంటే ఎక్కువగా ఉంది. అయితే విశాల్ మార్ట్ కూడా క్రమంగా వ్యాపారంలో ప్రగతి సాధిస్తోంది. 2024 మార్చి 30వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో డీమార్ట్ కంటే అధిక రాబడిని నమోదు చేసింది. విశాల్ మెగా మార్ట్ కు దేశ వ్యాప్తంగా 645, డీమార్ట్ కు 377 దుకాణాలు ఉన్నాయి. అయితే డీమార్ట్ దుకాణాలు విశాలంగా, పెద్దవిగా కనిపిస్తాయి. అయితే చిన్న పట్టణాలు, నగరాల్లో సైతం విశాల్ మార్ట్ దుకాణాలు విస్తరించడంతో ప్రజలకు మరింత చేరువ అవుతోంది.

విశాల్ మార్ట్ తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని సాధారణ వస్తువులు (జీఎం), దుస్తుల నుంచి ఎక్కువగా పొందుతోంది. దాని అమ్మకాల్లో ఇది దాదాపు 72.5 శాతం వాటా కలిగి ఉంది. అయితే అవెన్యూ మార్ట్ కు పైన తెలిపిన విభాగాల నుంచి 23.5 శాతం మాత్రమే పొందుతోంది. కిరాణా, ఆహారం, ఇతర వేగంగా కదిలే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తులతో పోల్చితే సాధారణ వస్తువులు, దుస్తులతో లాభం అధికంగా ఉంటుంది. ఇది విశాల్ మార్ట్ కు అనుకూలంగా మారింది. ఆర్టిక గణాంకాల పరంగా రెండు కంపెనీలలో డీమార్ట్ కే ఎక్కువ మార్కులు ఉన్నాయి. ఈ సంస్థ 13.56 శాతం నికర విలువ(ఆర్వోఎన్ డబ్ల్యూ)పై రాబడి ఉంది. దీనికి మార్కెట్ లో సుస్థిర స్థానం నెలకొంది. విశాల్ మార్ట్ విలువ 8.18 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇది గౌరవ ప్రదంగానే ఉన్నప్పటికీ డీమార్ట్ తో పోల్చితే బాగా తక్కువ.

ప్రముఖ వ్యాపార వేత్త రాధాకిషన్ దమానీ నాయకత్వం, వ్యూహాత్మక నిర్ణయాలు డీమార్ట్ ను విజయవంతంగా నడిపిస్తున్నాయి. ఈ విషయమే పెట్టుబడిదారులకు విశ్వాసం పెంచుతోంది. చాలామంది డీమార్ట్ స్టాక్ లను కొనుగోలు చేయడానికి ప్రేరణగా నిలుస్తోంది. మరో వైపు విశాల్ మార్ట్ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతోంది. ఆ ప్రయత్నంలో ఇంకా తొలిదశలోనే ఉంది. కంపెనీ ప్రగతి కూడా ఆశాజనకంగానే కొనసాగుతోంది. కానీ డీమార్ట్ కు ఉన్న స్థిరమైన నాయకత్వం, గుర్తింపు పూర్తిస్థాయిలో రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *