Credit Card Charges: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలెర్ట్.. కీలకమైన చార్జీల సవరణ

Credit Card Charges: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలెర్ట్.. కీలకమైన చార్జీల సవరణ


డిసెంబర్ 1, 2024 నుంచి అనేక బ్యాంకుల క్రెడిట్ కార్డ్ పాలసీలకు ప్రధాన మార్పులు చేశారు. ఈ సవరణల వల్ల అనేక రుసుములు, ప్రోత్సాహకాలు, లావాదేవీల నిబంధనలు మారాయి. అయితే ఈ నిబంధనలు వినియోగదారులు గుర్తించకపోతే భారీ స్థాయిలో జరిమానాల బాదుడును ఎదుర్కొవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డులకు సంబంధించిన తాజా నిబంధనల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్

డిసెంబర్ 1, 2024 నాటికి రూ. 50,000 కంటే ఎక్కువ ఉన్న ఎస్‌బీఐ కార్డ్ యుటిలిటీ చెల్లింపులకు 1 శాతం రుసుము వర్తిస్తాయని ఎస్‌బీఐ ప్రకటించింది. అలాగే సింప్లిక్లిక్, ఆరమ్, గోల్ ఎస్‌బీఐ కార్డులను డిజిటల్ గేమింగ్‌లో ఉపయోగిస్తే ఎలాంటి రివార్డులు అందించవని ఎస్‌బీఐ ప్రతినిధులు చెబుతున్నారు. 

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్

యాక్సిస్ బ్యాంక్ క్యాష్ రిడెంప్షన్‌ల కోసం రూ. 9తో పాటు 18 శాతం జీఎస్‌టీని, మైలేజ్ పాయింట్ బదిలీలకు రూ. 199తో పాటు 18 శాతం జీఎస్‌టీని డిసెంబర్ 20, 2024 నుంచి విధిస్తుంది. అలాగే వడ్డీ రేట్లు, పెనాల్టీ ఖర్చులు, వాలెట్, ఇంధన కొనుగోళ్లు, అద్దె చెల్లింపులకు సంబంధించిన లావాదేవీల రుసుములు యాక్సిస్ బ్యాంక్ సవరించింది. మరిన్ని వివరాలను యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్

యస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ సేవలను మెరుగుపరచడానికి రివార్డ్ పాయింట్ల పాలసీని అప్‌డేట్ చేసింది. హోటల్‌లు, విమానాలను బుక్ చేసుకోవడానికి ఉపయోగించే రివార్డ్ పాయింట్‌ల సంఖ్యపై కొత్త పరిమితులు డిసెంబర్ 1, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. యస్ బ్యాంక్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ కార్డును బట్టి వేర్వేరుగా ఉంటాయి. యస్ ప్రైవేట్, యస్ మార్క్యూ,  వంటి ప్రీమియం కార్డ్‌లు అధిక పరిమితులు ఉంటాయి. అలాగే ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లను యాక్సెస్ చేయడానికి కార్డ్ హోల్డర్‌లు ఏప్రిల్ 1, 2025 నాటికి కొన్ని పరిమితులును చేరుకోవాల్సి ఉంటుంది. ఆరు లాంజ్ సందర్శనలను ఆశ్వాదించడానికి యస్ మార్క్యూ కార్డ్ హోల్డర్‌లు తప్పనిసరిగా రూ. 1 లక్ష ఖర్చు చేయాలి. అయితే యస్ ఫస్ట్ ప్రిఫర్డ్ కార్డ్ హోల్డర్‌లు తప్పనిసరిగా రెండు సందర్శనలకు రూ.75,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన ఇక్సిగో ఏయూ క్రెడిట్ కార్డ్ ఫీచర్‌లకు డిసెంబర్ 22, 2024 నుంచి సర్దుబాట్లు చేస్తుంది. ప్రభుత్వ సేవలు, విద్య, అద్దె చెల్లింపులు, భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (బీబీపీఎస్) కార్యకలాపాలకు సంబంధించిన నిర్దిష్ట రకాల లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్‌లు అందించమని స్పష్టం చేసింది. అలాగే డిసెంబరు 23, 2024 నాటికి విదేశీ లావాదేవీలపై 0 శాతం ఎఫ్ఎక్స్ మార్కప్‌ని అమలు చేయడానికి ఏయూ బ్యాంక్ విదేశీ కొనుగోళ్లకు కూడా రివార్డ్ పాయింట్‌లను మంజూరు చేయమని పేర్కొంది. యుటిలిటీ, బీమా, టెలికాం కొనుగోళ్ల ద్వారా పొందే రివార్డు పాయింట్లను కూడా సవరించింది. ముఖ్యంగా బీమా చెల్లింపులకు రూ.100కి ఒక రివార్డు పాయింట్ అందిస్తారు. బీమా లావాదేవీకి 100 రివార్డ్ పాయింట్‌ల పరిమితితో, కార్డ్ హోల్డర్‌లు ఈ కేటగిరీల్లో చెల్లించిన ప్రతి రూ. 100కి 1 రివార్డ్ పాయింట్‌ను అందిస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *