క్రిస్మస్ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన వస్తుంది. క్రిస్మస్ని క్రైస్తవులు అతి పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ఏసు ప్రభు జన్మించాడని ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇదే రోజున చాలా మందికి కేక్ కట్ చేయడం, కేక్ పంచి పెడుతూ ఉంటారు. ఈ ఏడాది కేక్ మాత్రం బయట కొనకుండా ఇంట్లో ఏంతో ఈజీగా, తక్కువ సమయంలోనే అయ్యేలా చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ కేక్ ఎంతో రుచిగా కూడా ఉంటుంది. పైగా ఇంట్లోనే చేస్తాం కాబట్టి ఆరోగ్యం కూడా. మరి ఈ డ్రై ఫ్రూట్ కేక్ ఎలా తయారు చేస్తారు? ఈ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
డ్రై ఫ్రూట్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
పెరుగు, పాలు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పాల పొడి, డ్రై ఫ్రూట్స్, వెనిల్లా ఎసెన్స్, నెయ్యి, పంచదార పొడి, ఉప్పు, మైదా పిండి.
డ్రై ఫ్రూట్ కేక్ తయారీ విధానం:
డ్రై ఫ్రూట్ కేక్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి మైదా పిండి జల్లించి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పాల పొడి అన్నీ జల్లించి తీసుకోవాలి. వీటిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని పెరుగు, షుగర్ పౌడర్, నెయ్యి వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి పిండి మిశ్రమం వేసి ఒకసారి అంతా మిక్స్ చేయాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి మొత్తం అంతా బాగా బీట్ చేయాలి. ఈ పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ అంత స్మూత్‌గా, ఫ్లఫ్ఫీగా వస్తుంది. ఆ తర్వాత ఇందులోనే పాలు, వెనీలా ఎసెన్స్ వేసి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బీట్ చేసిన మిశ్రమంలో డ్రై ఫ్రూట్స్, నెయ్యి కూడా వేసి మళ్లీ కలపండి. పిండి మిశ్రమాన్ని ఎంత బాగా కలిపితే అంత రుచిగా వస్తుంది కేక్.
ఇప్పుడు కేక్ పాన్ తీసుకుని అంతా నెయ్యి రాయాలి. ఆ తర్వాత ఇందులోకి కేక్ మిశ్రమాన్ని ఉంచండి. పై నుంచి ఏమన్నా డ్రై ఫ్రూట్స్ మిగిలిఉంటే స్ప్రెడ్ చేయండి. ట్రూటీ ఫ్రూటీ కూడా వేయండి. ఇప్పుడు దీన్ని 180 డిగ్రీ సెల్సీయస్ వద్ద ప్రీ హీట్ చేసిన ఓవెన్లో ఉంచి ఓ అరగంట పాటు బేక్ చేయాలి. ఓవెన్ ఆఫ్ చేసిన తర్వాత కేక్ తీసి డెకరేషన్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ కేక్ సిద్ధం.