క్యారెట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యారెట్ గురించి చాలా మందికి తెలుసు. క్యారెట్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. క్యారెట్‌తో లభించే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. చాలా మంది క్యారెట్ తింటే కేవలం కళ్లు మాత్రమే బాగా కనిపిస్తాయి అనుకుంటారు. అలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. క్యారెట్లు తినడం వల్ల చర్మం, జుట్టు, గుండె, కాలేయం, మూత్ర పిండాలు ఇలా శరీరంలో ఉండే అన్ని భాగాలకు క్యారెట్ మేలు చేస్తుంది. క్యారెట్‌ను మనం కూరలుగా, స్వీట్‌గా తీసుకోవచ్చు. ప్రతి రోజూ చిన్న క్యారెట్ ముక్క తిన్నా.. ఉండే లాభాలు ఊహించనవి. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. క్యారెట్ తినడం వల్ల మరి ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్లో పోషకాలు:
ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, పొటాషియం, సోడియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, క్యాల్షియం, కాపర్, మాంగనీస్, ఫాస్పరస్‌లు లభిస్తాయి.
క్యారెట్స్ తినడం వల్ల ఉపయోగాలు:
1. క్యారెట్లో ఉండే విటమిన్లు ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే చర్మం అందంగా, కాంతివంతంగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
2. క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్.. శరీరంలోకి వెళ్లగానే విటమిన్ ఎగా మారుతుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్లు బాగా కనిపించేలా చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది.
3. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్లు.. జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యలు రానివ్వకుండా చేస్తుంది.
4. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, రక్తపోటును బ్యాలెన్స్ చేయడంలో క్యారెట్ చక్కగా సహాయ పడుతుంది.
5. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది క్యారెట్. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది.
6. అధిక బరువును తగ్గించడంలో, శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో క్యారెట్ ఉపయోగ పడుతుంది.
7. విష పదార్థాలను, వ్యర్థాలను బయటకు పంపించడంలో కూడా సహాయ పడుతుంది. దంతాలు, చిగుళ్లకు కూడా క్యారెట్ మేలు చేస్తుంది.
8. జీవక్రియను మెరుగు పరుస్తుంది. డయాబెటీస్‌ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఊపిరి తిత్తులకు, లివర్‌కు రక్షణ కల్పిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.