చికెన్, మటన్, ఎగ్ 65 ఖచ్చితంగా తినే ఉంటారు. రెస్టారెంట్లకు వెళ్లారంటే ఈ ఐటెమ్స్ ఖచ్చితంగా ఆర్డర్ పెడతారు. టేస్టీగా ఇవి కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడూ నాన్ వెజే కాకుండా వెజిటేరియన్ కూడా తింటూ ఉండాలి. ఇందులో క్యాబేజీతో చేసే 65 కూడా చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్‌కి ఏమాత్రం తీసిపోదు. కాస్త స్పైసీ లెవల్స్ తగ్గిస్తే చిన్న పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఈ క్యాబేజీ 65ని ఇంట్లో కూడా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. మరి ఈ క్యాబేజీ 65కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూసేయండి.
క్యాబేజీ 65కి కావాల్సిన పదార్థాలు:
క్యాబేజీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మైదా పిండి, ఉప్పు, పసుపు, పచ్చి మిర్చి సాస్, మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆయిల్, టమాటా కెచప్, సోయా సాస్.
క్యాబేజీ 65 తయారీ విధానం:
ముందుగా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నీళ్లు వాడ్చి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే కారం, ఉప్పు, పచ్చిమిర్చి సాస్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి అంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కగానే క్యాబేజీ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసి టిష్యూ పేపర్‌లోకి తీసుకోవాలి. అంతే క్యాబేజీ 65 సిద్ధం.
ఇవి కూడా చదవండి
క్యాబేజీ 65 ఇలా కూడా తినవచ్చు. లేదంటే దీని కోటింగ్ ఇచ్చి కూడా తినవచ్చు. అందుకోసం ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. అందులో పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉంటే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఓ సారి వేయించండి. ఆ తర్వాత ఇందులోనే టమాటా కెచప్, కొద్దిగా సోయా సాస్ వేసి అంతా మిక్స్ చేసిన తర్వాత వేయించిన క్యాబేజీ కూడా వేసి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా కూడా తినవచ్చు.