మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. 2025 సంవత్సరంలో అనేక శుభకార్యాలు జరగనున్నాయి. అలాగే కొత్త సంవత్సరం ప్రారంభంలో తేలివితేటలు, వ్యాపారాన్ని ఇచ్చే గ్రహం బుధుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. నూతన సంవత్సరంలో బుధుడు బృహస్పతి రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధ గ్రహం తన రాశిని జనవరి 4, 2025న మార్చుకోనున్నాడు.
బుధుడు ధనుస్సు రాశిలోకి జనవరి 4వ తేదీ మధ్యాహ్నం 12:11 గంటలకు ప్రవేశిస్తాడు. దీని తరువాత జనవరి 24 వరకు ఈ రాశిలో సంచరించనున్నాడు. ధనుస్సు రాశిలో బుధుడు సంచారంతో నాలుగు రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ నాలుగు రాశుల వారు వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. జ్యోతిష్యం ప్రకారం ఈ నాలుగు రాశులు ఏవో తెలుసుకుందాం.
మేష రాశి: నూతన సంవత్సరంలో ధనుస్సు రాశిలో బుధగ్రహ సంచారం మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారి ఆర్థిక పరిస్థితులు బలపడతాయి. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో కొత్త ఇల్లు , వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పనిలో వచ్చే అడ్డంకులు తొలగిపోయి జీవితంలో విజయానికి బాటలు ఏర్పడతాయి.
ఇవి కూడా చదవండి
కన్య రాశి: ఈ బుధ గ్రహ సంచారం కన్య రాశి వారికి మంచి రోజులను తెస్తుంది. ఈ సమయంలో కన్య రాశి వ్యక్తుల జీవితంలో, పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. మరిన్ని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. చేసిన మంచి పనులకు కుటుంబ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. డబ్బు ఆదా అవుతుంది. ఈ కాలంలో ఈ సమయంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.
మీన రాశి: బుధ సంచారం తర్వాత మీన రాశి వారు కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆగిపోయిన పని పూర్తవుతుంది. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికను కూడా రూపొందించవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు ఈ కాలంలో పూర్తవుతాయి.
మిధున రాశి: బుధ గ్రహ సంచారము తరువాత మిథున రాశి వారు తమ వృత్తిలో విజయాన్ని పొందుతారు. ఏదైనా పరీక్ష రాసి ఉంటే పాస్ అవుతారు. ఈ కాలంలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.