Brahmamudi, December 17th Episode: రుద్రాణికి మతిస్థిమితం లేదన్న రాజ్.. వంద కోట్ల గురించి టెన్షన్!

Brahmamudi, December 17th Episode: రుద్రాణికి మతిస్థిమితం లేదన్న రాజ్.. వంద కోట్ల గురించి టెన్షన్!


ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఓ ఫ్యామిలీ దుగ్గిరాల ఇంటికి వస్తుంది. వాళ్లను చూసిన రుద్రాణి.. ఏయ్ ఎవరు మీరు? ఏంటి ఇలా వచ్చేస్తున్నారు? ఈ సెక్యూరిటీ ఎక్కడ చచ్చాడో అని అంటుంటే.. సెక్యూరిటీకి మేము తెలుసు అమ్మా అని వాళ్లు అంటారు. తెలిస్తే మాత్రం బయట నిలబడి పిలవాలి. అసలు ఎవరు మీరు? అని రుద్రాణి అడుగుతుంది. సీతారామయ్య గారు మా అబ్బాయిని కాలేజీలో చేర్పించిన దగ్గర నుంచి చదివిస్తున్నారమ్మా.. మా అబ్బాయి అన్నింట్లో కూడా మార్కులు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంజినీరింగ్‌లో సీటు వచ్చింది. ధన సహాయం చేస్తాను రమ్మని అన్నారమ్మా అని అతను చెబితే.. ఓహో ఇన్నాళ్లూ బాగానే నొక్కుతున్నారు అన్నమాట.. ఇప్పుడు ఆ పెద్దాయన ఆస్పత్రిలో కోమాలో ఉన్నాడు. బ్రతుకుతాడో లేడో తెలీదు. ఆయనకే లక్షలకు లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఇక మీకేం సహాయం చేస్తాడు. అంత చదివించే స్థోమత లేనప్పుడు ఇలా మంది మీద ఆధారపడటం ఎందుకు? ఏదన్నా ఉద్యోగం చూసుకోమను అని రుద్రాణి అంటుంది. కనీసం సుభాష్‌ గారితో అయినా ఒక మాట అని అతను అంటే.. సుభాషూ లేడు సుబ్బారావు కూడా లేడు.. వెళ్లండి అని ఇంట్లోంచి తరిమేస్తుంది రుద్రాణి.

రుద్రాణికి ఇచ్చి పడేసిన స్వప్న..

బయటకు వచ్చిన వాళ్లు.. బాధ పడకురా పెద్దాయనే ఉంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని అనుకుంటూ ఉండగా.. రాజ్ అప్పుడే వచ్చి అది వింటాడు. లోపలికి వెళ్లి.. అత్తా ఎవరు వాళ్లు? అని అడుగుతాడు. ముష్టివాళ్లు.. పేదవాళ్లంట.. మీ తాతయ్య గారు దానవీర శూర కర్ణ కదా.. ఆ పిల్లాడిని చదివించడానికి లక్షలకు లక్షలు అడిగి తీసుకెళ్లడానికి వచ్చారని రుద్రాణి అంటే.. మరి నువ్వు ఏం అన్నావు? అని రాజ్ అడుగుతాడు. నేనేం అంటాను? దానం చేసే దానయ్యలకు దానం చేసుకుంటూ పోతే చివరికి చిప్పే మిగులుతుందని కుదరదు పొమ్మన్నాను అని రుద్రాణి చెబితే.. ఎందుకు అలా అన్నావు? వాళ్లకు తాతయ్య మాట ఇచ్చాడు. మాట ఇచ్చాక ఎలా తప్పుతాం అనుకున్నావ్? అలా చేస్తే తాతయ్యను అవమానించినట్టే.. అత్తా ఇంకొకసారి నీకు సంబంధం లేని విషయాల్లో దూరకు అని రాజ్ వెళ్లి.. వాళ్లను పిలుచుకొస్తాడు. ఈలోపు అత్తకు వార్నింగ్ ఇస్తుంది స్వప్న. సుభాష్ అంకుల్.. రాహుల్‌ని ఎవరు చదివించారు? వాళ్ల నాన్నా? లేక వాళ్ల అమ్మానా అని అడిగితే.. తనకే దిక్కు లేదు.. మా నాన్నే అని సుభాష్ అంటాడు. అదేంటి? ఇలాంటి గతి లేని వాళ్లను ఇంట్లో పెట్టి చదివించినందుకు.. దారిన పోయే దానయ్యలను దానం చేస్తే తప్పు ఏంటని స్వప్న అంటుంది. ఏయ్ స్టూపెట్ వాళ్లూ మేము ఒక్కటేనా అని రుద్రాణి అంటే.. ఎస్ ఒక్కటే. మీ మొగుడు సొమ్ము ఏదో దోచి పెట్టినట్టు ఫీల్ అవుతున్నావ్? ఏంటి అత్తా.. అని ఇచ్చి పడేస్తుంది స్వప్న.

తాత మాట నిలబెట్టిన రాజ్.. రుద్రాణి పరువు తీసేసిన ఇందిరా దేవి..

అప్పుడే వచ్చిన రాజ్.. మా అత్తకు ఈ మధ్య మతిస్థిమితం చలించింది. మీరు అవేమీ పట్టించుకోకండి అని అంటాడు. వాళ్లను చూసిన సుభాష్.. మీరు వచ్చారని నాకు తెలీదు ప్రసాద్ గారు అని అంటాడు. అవును బాబును చదివించడానికి మా తాతయ్య ఎంత సహాయం చేస్తానని అన్నాడు? అని రాజ్ అడిగితే.. ఐదు లక్షల దాకా అవుతుందని ప్రసాద్ చెప్తాడు. ఆ తర్వాత కావ్యని వెళ్లి డబ్బు తీసుకురమ్మని చెప్తాడు రాజ్. వాళ్లు వెళ్లిపోయాక.. ఏంట్రా నాకు మతిస్థిమితం లేదా అని రుద్రాణి అడుగుతుంది. నా భర్త కష్టాన్ని నాకు దానం చేసే హక్కు ఉంది. కాదనడానికి నువ్వు ఎవరు? నేను ఎవరు? స్వప్న అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు? అని ఇందిరా దేవి అంటే.. ఆ కుర్రాడు? నా కొడుకు ఒక్కటేనా అని రుద్రాణి అడిగితే.. ఒక్కటే.. ఒక వేళ ఆయన ఆ యావదాస్తిని దానధర్మాలకు వదలుకోవడానికి సిద్ధ పడ్డా ఆ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని ఇందిరా దేవి అంటుంది. అప్పుడు అందరం రోడ్డున మీద పడతామని రుద్రాణి అంటే.. పడితే ఏం అవుతుంది? నా కొడుకులు, మనవలు సమర్థలు.. మళ్లీ సంపాదిస్తారు. అసలు వారసులకు లేని బాధ కొసరు వారసులకు వచ్చిందా.. కుటుంబ పరువును కాపాడావని ఇందిరా దేవి అంటుంది.

ఇవి కూడా చదవండి

అప్పూ ప్రేమ..

ఆ తర్వాత అప్పూ.. కళ్యాణ్‌కి ఫోన్ చేస్తుంది. కళ్యాణ్ ఆస్పత్రిలో ఉంటాడు. బయటకు వచ్చి ఎత్తుతాడు. హలో నేను మాట్లాడేది సరస్వతీ పుత్రుడితోనేనా? అని అప్పూ అడిగితే.. ఎలా ఉన్నావు పొట్టీ అని కళ్యాణ్ అంటాడు. అది నేను నిన్ను అడగాలి కూచి.. ఏమైపోయావు.. అసలు ఊరిలోనే ఉన్నావా.. షికార్లు చేస్తున్నావా? కట్టుకున్న పెళ్లాం ఏదో సాధిద్దామని దూరంగా, ఒంటరిగా వెళ్లిందే.. ఎలా ఉందో లేదో తెలుసుకోవాలి అనిపించలేదా.. ఒక ఫోన్ లేదు.. ఒక మెసేజ్ లేదని అప్పూ అంటుంది. కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఏంట్రా మాట్లాడు.. తిట్టానాని ఫీల్ అయ్యావా.. ఊరికే ఉన్నాను రా భయ్. ఏం చేయాలో ఊసుపోక నిన్ను కాసేపు ఆట పట్టాద్దామని అన్నానని అప్పూ అంటుంది. అదేం లేదులే పొట్టీ నన్ను ఏన్నైనా ఏమన్నా అనొచ్చని కళ్యాణ్ అంటాడు. సరే చెప్పు ఎక్కడ ఉన్నావని అప్పూ అడిగితే.. ఇప్పుడు ఈ విషయం చెప్పి తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదని మనసులో అనుకుంటాడు కళ్యాణ్. అప్పుడే డాక్టర్.. డాక్టర్ అనే అరుపులు వినిపిస్తాయి. ఏంటి ఆ సౌండ్స్.. నువ్వు ఆస్పత్రిలో ఉన్నావా.. నీకైమైనా అయ్యిందా నిజం చెప్పమని అప్పూ అడిగితే.. నాకేం కాలేదు. లిరిక్ రైటర్‌కి జ్వరం వస్తే ఆస్పత్రికి తీసుకొచ్చానని కళ్యాణ్ అంటే.. అంతే కదా బ్రతికించావ్.. నీకే ఏమన్నా అయితే నేను సంతోషంగా ఉండను. అవసరం అయితే ఈ ట్రైనింగ్ కూడా వదిలేసి వచ్చేస్తానని అప్పూ అంటుంది. ఏమీ లేదు నువ్వు ఉషారుగా ఉండమని కళ్యాణ్ చెప్తాడు. సరేనని అంటుంది అప్పూ.

ఖజానా మొత్తం ఖాళీ అయ్యేలా ఉంది..

మరోవైపు కావ్య పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సుభాష్ వచ్చి.. అమ్మా కావ్యా అర్జెంట్‌గా రెండు లక్షలు తీసుకురామ్మా.. బయటకు వెళ్తున్నాని సుభాష్ అంటాడు. కావ్య తీసుకొచ్చి ఇస్తుంది. ఆ తర్వాత ప్రకాశం వస్తాడు. కావ్య అని పిలిచి అసలు విషయం మర్చిపోతాడు. సరే ఈలోపు గుర్తు చేసుకోమని కావ్య అంటుంది. నాకు గుర్తుకు వచ్చింది అమ్మా.. లక్ష కావాలని ప్రకాశం అంటే.. తీసుకొచ్చి ఇస్తుంది కావ్య. ఆ తర్వాత పని చేసుకుంటూ ఉండగా రాహుల్ వచ్చి.. రూ.50 వేలు కావాలని డబ్బులు అడుగుతాడు. అదేంటి మీ మమ్మీ ఉదయం వచ్చి డబ్బు తీసుకెళ్లింది కదా అంత డబ్బు నీకు ఎందుకు? అని కావ్య అంటే.. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే నేరుగా ధాన్యలక్ష్మి అత్తయ్య దగ్గరకు వెళ్లి అడుగుతా.. అప్పుడు సీన్ వేరేలా ఉంటుందని రాహుల్ అంటే.. ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే అనవసరంగా గొడవ చేస్తుంది. ఎందుకులే ఇప్పుడు ఇచ్చేద్దామని కావ్య అనుకుని.. ఉండు తీసుకొస్తానని డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది. ఇలా అడిగిన వాళ్లకు ఇచ్చుకుంటూ పోతే ఖజానా మొత్తం ఖాళీ అయ్యేలా ఉంది. మళ్లీ అందరూ లెక్కలు అడిగితే నేను ఏం చెప్పాలి. నా వల్ల కాదు ఆయనకు చెప్పి ఈ తాళాలు అప్పగించాలని కావ్య అనుకుంటుంది. ఇక రాజ్ వంద కోట్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

కావ్య తాళాల బాధ..

అప్పుడే కావ్య కాఫీ చేసి రాజ్ దగ్గరకు వచ్చి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏయ్ వద్దు నాకు వెళ్లిపో ఇక్కడి నుంచి అంటూ రాజ్ అరుస్తాడు. దీంతో కావ్య అపర్ణ దగ్గరకు వెళ్తుంది. ఆవిడకు తాళాలు ఇస్తుంది. ఇదేంటి? అని అపర్ణ అడిగితే.. మీరు దింపుకున్న బరువు.. నేను మోయలేక పోతున్నాను అని కావ్య అంటే.. ఇది బరువు కాదు.. బాధ్యత. ఈ ఇంటి గౌరవం అని అపర్ణ అంటుంది. తాళాలు అక్కడ పెట్టేసి మీ గౌరవం మీ దగ్గరే పెట్టుకోండి. నాకు ఇప్పుడు హాయిగా ఉంది. ఇది తాతయ్య గారి ఆర్డర్.. అమ్మమ్మగారి అభిలాష అని అపర్ణ అంటే.. వాళ్లకు నేను ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తాను. మీరు ఎన్ని అనుకున్నా.. ఈ బరువు నాకు వద్దని కావ్య అంటుంది. అసలు ఏం జరుగుతుందో చెప్పు అని అపర్ణ అడిగితే.. ఒక్కొక్కరు వస్తారు.. ఒక్కొక్కరికి లక్షల్లోనే అవసరాలు ఉన్నాయి. ఇవ్వకపోతే కోపం.. నువ్వెంత నీ లెక్క ఎంత? నీ పుట్టింటి ఆస్తినా అంటూ వాళ్ల మాటలు అంటూ కావ్య తన బాధను చెబుతుంది. ఇక ఈ రోజు ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో ఇందిరా దేవికి వంద కోట్ల నిజం తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *