Blue City: ప్రపంచంలోకెల్లా ఏకైక బ్లూ సిటీ..! ఇదేదో గ్రీస్ దేశం అనుకునేరు.. మనదగ్గరే మీరు ఓ లుక్కేయండి..

Blue City: ప్రపంచంలోకెల్లా ఏకైక బ్లూ సిటీ..! ఇదేదో గ్రీస్ దేశం అనుకునేరు.. మనదగ్గరే మీరు ఓ లుక్కేయండి..


భారతదేశంలోనే ఉన్న ఓ నగరాన్ని బ్లూ సిటీగా పిలుస్తారు.. ఇది ప్రపంచంలోని ఏకైక బ్లూ సిటీ. ఇక్కడ నివసించడం భోజనం, ప్రయాణం చాలా చౌక. ఇంతకీ ఈ బ్లూ సిటీ ఎక్కడితో చెప్పలేదు కదా..? రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరం.. జోధ్‌పూర్‌ను బ్లూ సిటీగానూ పిలుస్తారు. ఇక్కడ ఉండే ఇల్లు, ఎత్తైన భవనాలన్నీ నీలిరంగులో నిగనిగలాడుతూ ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. అందుకే దీన్ని బ్లూ సిటీ ఆఫ్‌ ఇండియాగా పిలుస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ బ్లూ సిటీని చూసి ఆశ్చర్యపోతారు. ఎంతో గొప్పగా, నగరంగా పర్యాటకుల్ని ఆకర్షించేలా ఉంటుంది. దీని విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరం దాదాపు 650 సంవత్సరాల క్రితం స్థిరపడిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నగరాన్ని 1459లో రాథోడ్ వంశానికి చెందిన రావ్ జోధా రాజ్‌పుత్ స్థాపించారని చెబుతారు.. ఎత్తైన కొండపై ఈ నగరాన్ని నిర్మించాడు. కానీ జనాభా పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా అనేక ఇళ్లను నిర్మించారు. ఎటు చూసినా బ్లూ కలర్ భవనాలే దర్శనమిస్తాయి. దీంతో ఈ నగరం పర్యాటక పరంగా కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూ వస్తోంది.

జోధ్‌పూర్ మంచి పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక రాజభవనాలు, కోటలు, దేవాలయాలు, అద్భుతమైన కట్టడాలు ప్రతి ఒక్కర్నీ కట్టేపడేస్తు్న్నాయి. ఇక్కడ చూడాల్సిన అద్భుతమైన కట్టడాలు, రాజభవనాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనవి ఉమైద్ భవన్ ప్యాలెస్, జస్వంత్ థాడా, క్లాక్ టవర్ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాగే మాండోర్ గార్డెన్, కైలానా సరస్సు, బాల్సమండ్ సరస్సు, మచియా బయోలాజికల్ పార్క్, రావు జోధా ఎడారి రాక్ పార్క్, రతనాడ గణేష్ ఆలయం, మసూరియా హిల్స్, వీర్ దుర్గాదాస్ స్మారక చిహ్నం, సుర్పురా డ్యామ్, భీమ్ భడక్ గుహ వంటివి ఉన్నాయి. ఇక థార్ డెసర్ట్ అందాలు మాత్రం మర్చిపోకుండా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *