బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. 105 రోజుల పాటు రసవత్తరంగా సాగిన ఈ రియాలిటీషో తుది అంకానికి చేరుకుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో బిగ్ బాస్ సీజన్ 8 విజేతను ప్రకటించనున్నారు. కాగా ఈసీజన్ లో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. మొదట 14 మంది మెయిన్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాగా, ఐదు వారాల తర్వాత మరో 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక చివరకు ఐదుగురు మిగిలారు. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ రేసులో నిలిచారు. మరి వీరిలో ఎవరు రూ.55 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకోనున్నారు? ఎవరు రన్నరప్‌గా నిలవనున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే టీవీ 9 తెలుగును ఫాలో అవ్వండి.. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం అందించేందుకు రెడీగా ఉంది.