Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో.. బయట ఇలా.. ప్లేట్ తిప్పేసిన బిగ్‏బాస్ విన్నర్..

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో.. బయట ఇలా.. ప్లేట్ తిప్పేసిన బిగ్‏బాస్ విన్నర్..


బిగ్ బాస్ హౌస్ లో చాలా సెన్సిటివ్ పర్సన్ నిఖిల్. ఇతరులు హర్ట్ అవుతారేమో అనుకుని మాట్లాడిన మాటలే తనకు రివర్స్ అయ్యాయి. సీరియల్ నటి కావ్యతో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నాడు నిఖిల్. కానీ హౌస్ లో తన పేరు చెప్పకుండానే తన లవ్ స్టోరీ చెప్పి అడియన్స్ అందరినీ కన్నీళ్లు పెట్టించాడు. షో అవ్వగానే తన దగ్గరికి వెళ్లిపోతాను.. తిడితే పడతాను.. కొట్టినా సరే తనే నా భార్య అంటూ ఎమోషనల్ డైలాగ్స్ తో గొప్ప ప్రేమికుడు అనిపించుకున్నాడు. షో పూర్తికాగానే నేరుగా తన దగ్గరకు వెళ్తానని చెప్పిన నిఖిల్.. ఇప్పుడు ఊహించని ఆన్సర్ ఇచ్చాడు.

బిగ్‏బాస్ హౌస్ లో నిఖిల్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే తెలిసింది తనే నా భార్య అని. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని బ్రేకప్స్ మర్చిపోయేలా చేసింది. నవంబర్ 22తో మా ప్రేమకు ఆరేళ్లు. మేము విడిపోయామా ? కలిసి ఉన్నామా అని నన్ను అడిగితే ఆ ఎమోషన్ బాండ్ నుంచి విడిపోలేదు. భవిష్యత్తులోనూ తనతోనే ఉంటాను. తనే నా భార్య. హార్ట్ లో ఫిక్స్ అయిపోయా. ఫ్యామిలీ అంతా వచ్చేసరికి కష్టమై సైలెంట్ అయ్యాను. కొంచెం స్పీచ్ ఇచ్చాను. ఆమెతో నాకు జన్మ జన్మలకు సరిపోయే జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. విడిపోయినప్పుడు తనపై చాలా కోపం వచ్చింది. నావైపు కూడా తప్పు ఉంది. నేను మంచివాడిని అని చెప్పడం లేదు. నాకు మా అమ్మ ఎలాగో తను కూడా అలాగే. తనని వదిలేయలేదు. ఈ షో తర్వాత తన దగ్గరకు వెళ్లిపోతాను. ఏడ్చినా, కోప్పడినా మళ్లీ వెళ్తా. పిచ్చిలేస్తే లేపుకుపోతా.. ఐయామ్ సారీ. ఈ షో నుంచి బయటకువచ్చిన మరుక్షణమే నీ ముందు నిలబడతా.. నువ్వు నాకు కావాలి” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్.

కానీ బిగ్‏బాస్ సీజన్ 8 విజేతగా నిలిచిన నిఖిల్.. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నాడు. టైటిల్ గెలిచారు.. మరీ తన (కావ్య) దగ్గరకు వెళ్తానని చెప్పారు. మరి వెళ్తారా ? అని యాంకర్ అర్జున్ అంబటి అడగ్గా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు నిఖిల్. షో పూర్తికాగానే తన దగ్గరికే వెళ్తానని చెప్పాను. కానీ ఇప్పుడు బయట పరిస్థితి ఎలా ఉందో తెలియదు. వెళ్లి మాట్లాడాలనే అనుకుంటున్నాను.. కానీ నన్ను ఇక్కడ ఇష్టపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. అమ్మ, నాన్న, ఫ్యామిలీ వాళ్లందర్నీ పలకరించి.. ఆమె దగ్గరకు వెళ్దాం అనుకుంటున్నా.. చూడాలి ఏమౌతుందో అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *