Bigg Boss 8 Telugu: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? డాక్టర్ టు యాక్టర్.. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్

Bigg Boss 8 Telugu: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? డాక్టర్ టు యాక్టర్.. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్


తమ కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి వెళుతున్నాడంటే ఏ పేరెంట్స్ అయినా ఒకసారి ఆలోచిస్తారు. వద్దని నచ్చజెప్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. పై ఫొటోలో ఉన్న కుర్రాడిది కూడా అదే పరిస్థితి. అతనికి చిన్నప్పటి నుంచి రైటర్, డైరెక్టర్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ పేరెంట్స్ కు మాత్రం సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రకమైన భయం. దీంతో వారి కోసం చదువుపై దృష్టి పెట్టాడు. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కానీ సినిమాలపై ఆసక్తిని మాత్రం వదులుకోలేకపోయాడు. అందుకే డైరెక్షన్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. సొంతంగా కథ రాసుకుని డైరెక్షన్ కూడా చేస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఓ హిందీ సినిమాలోనూ కనిపించాడు. కానీ క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోకి అడుగు పెట్టాడో ఈ నటుడి పేరు మార్మోగిపోయింది. విజేతగా నిలవకపోయినా బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. అయితే బిగ్ బాస్ ప్రస్తుత సీజన్ లో ఆ లోటును కూడా తీర్చుకునేలా కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ డాక్టర్ బాబు టైటిల్ రేసులో అందరి కంటే ముందున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు గౌతమ్ కృష్ట అలియాస్ డాక్టర్ బాబు. పక్కన ఉన్నది అతని సోదరడు. ఇది వీరి చిన్నప్పటి ఫొటో. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో గౌతమ్ కృష్ణ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఎంబీబీఎస్ పూర్తి చేసిన గౌతమ్ కృష్ణ 2019లో ఆకాశవీధుల్లో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, డైరెక్షన్ బాధ్యతలను కూడా తనే నిర్వర్తించాడు. అలాగే హిందీలో సిద్దూ ది రాక్‌స్టార్‌ సినిమా తోనూ మెప్పించాడు. అయితే గతేడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తోనే గౌతమ్ కృష్ణ పేరు అందరికీ తెలిసింది. కానీ ఆ సీజన్ లో బిగ్ బాస్ ట్రోఫీ అందుకోలేకపోయాడు. అయితే ఆ లోటును పూడ్చుకోవాలనుకున్నాడేమో ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు. అనుకున్నట్లే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ రేసులో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు.

 బిగ్ బాస్ హౌస్ లో గౌతమ్ కృష్ణ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దాదాపు తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 01న ప్రారంభమైన ఈ రియాలిటీ షో కు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *