Bigg Boss 8 Telugu: ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. గౌతమ్ బ్రేకప్ స్టోరీ..

Bigg Boss 8 Telugu: ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. గౌతమ్ బ్రేకప్ స్టోరీ..


బిగ్‌బాస్ సీజన్ 8 మరికొన్ని గంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈసారి విన్నర్ అయ్యేందుకు గౌతమ్, నిఖిల్ మధ్య హోరా హోరీ పోటీ సాగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హౌస్మేట్స్ అందరికీ చివరి టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ షో అయిపోయాక ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నారు ? ఎవరిని ఎప్పటికీ కలవకూడదు అనుకుంటున్నారో చెప్పండి అంటూ బోర్ట్ పై ఫాలో, బ్లాక్ సింబల్స్ ఇచ్చారు. ఇక దాదాపు అందరినీ ఫాలో కావాలని అనుకుంటున్నట్లు అందరీ చెప్పారు. సోనియా పర్సనాలిటీ నచ్చలేదని అందుకే తనను బ్లాక్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది ప్రేరణ. ఆ తర్వాత హరితేజ, సోనియా ఇద్దరినీ బ్లాక్ చేస్తానని అన్నాడు నబీల్. తక్కువ పరిచయం ఉండడం వల్లే పృథ్వీని బ్లాక్ చేశానంటూ క్లారిటీ ఇచ్చాడు గౌతమ్. బేబక్క, సీతను బ్లాక్ చేశాడు నిఖిల్. అవినాష్.. పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేస్తానని అన్నాడు అవినాష్.

ఆ తర్వాత రాత్రి చలిమంట వేసి అందరూ మీ జీవితంలోని బెస్ట్, వరస్ట్ సంఘటనలను చెప్పాలని కోరాడు బిగ్‌బాస్. దీంతో ముందుగా నబీల్ మాట్లాడుతూ ఏదో సాధించాలని కలలు కన్న తనకు బిగ్‌బాస్ లాంటి పెద్ద ఆఫర్ రావడమే జీవితంలో బెస్ట్ విషయం అంటూ చెప్పాడు. తనకు 10వ తరగతి తర్వాత బైక్ యాక్సిడెంట్ జరిగిందని .. అప్పుడు హాస్పిటల్లో చూసిన లైఫ్ ది వరస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.

సూసైడ్ చేసుకోవాలనుకున్న గౌతమ్..

ఇవి కూడా చదవండి

ఇక గౌతమ్ తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్నారు. నేను ఇంతకు ముందే చెప్పాను.. డిల్లీలో మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒకమ్మాయితో బ్రేకప్ జరిగింది. ఆ బాధ తట్టుకోలేక ఒకరోజు నేను ఉంటున్న 18వ అంతస్తులోని బాల్కనీలో నుంచి దూకి చనిపోదామనుకున్నాను. చివరివరకూ వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నన్ను ప్రేమించేవాళ్లు గర్వపడేలా చేయాలనుకున్నాను. అప్పుడు ఈ ప్రపంచమే దాసోహం అవుతుందని ఆలోచించి ఆగిపోయాను అన్నాడు. జీవితంలో జరిగిన బెస్ట్ అంటే బిగ్‌బాస్ హౌస్ లోకి తన తల్లిని తీసుకురావడం ఎప్పటికీ మర్చిపోలేనంటూ చెప్పుకొచ్చాడు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *