బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు ఇటీవలే ఎండ్ కార్డ్ పడగా త్వరలోనే బిగ్ బాస్ కన్నడ కూడా ముగియనుంది. కాగా ఇప్పటి వరకు కిచ్చా సుదీప్ వరుసగా 11 సీజన్లలో కన్నడ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించారు. అయితే 12వ సీజన్ నుంచి అతను తప్పుకున్నాడు. ఈ విషయంపై సుదీప్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బిగ్ బాస్ నిర్వాహకులకు తెలియజేశాడు. అయితే ఆ నిర్ణయం వెనుక కారణాలేవన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. దీనిపై సుదీప్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. సినిమాల షూటింగ్ మధ్యలో బిగ్ బాస్ కోసం సమయం కేటాయించడం చాలా కష్టం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుదీప్ చెప్పుకొచ్చాడు. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘మ్యాక్స్’ డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇందుకోసం అతను తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో బిగ్ బాస్ పై ఓ ప్రశ్న ఎదురైంది. ఈ వేదికపైనే బిగ్ బాస్ షోకి ఎందుకు గుడ్ బై చెప్పాడో అసలు కారణం చెప్పాడు సుదీప్. ‘గత సీజన్‌లో మహాబలిపురంలో నా సినిమా షూటింగ్ జరుగుతోంది. చెన్నై నుంచి అక్కడికి చేరుకోవడానికి గంటన్నర పడుతుంది. బెంగళూరు నుంచి అక్కడికి వెళ్లి, అక్కడ షూట్ చేసి, అర్ధరాత్రి షూటింగ్ ముగించుకుని, ప్రైవేట్ విమానంలో బెంగళూరుకు తిరిగి వచ్చి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి, వీకెండ్ ఎపిసోడ్ షూట్ చేయాలి. ప్రతీసారి ఇలా చేయడం చాలా కష్టం’
‘మనం బెంగుళూరులో ఉంటే ఫర్వాలేదు. సినిమా షూటింగ్ వేరే చోట ఉంటే సరిగ్గా కుదరదు. నేను ఎక్కడ ఉన్నా గురువారానికి షూటింగ్ పూర్తి చేసి శుక్రవారం బిగ్ బాస్ కు అందుబాటులో ఉండాలి. సినిమాలు లేనప్పుడు సరే. సినిమా షూటింగ్ ఉంటే లేట్ అవుతుంది. ఇన్నేళ్లూ హ్యాపీగా చేశాను. ఇప్పుడు మరొకరిని చేయనివ్వండి’ అని సుదీప్ క్లారిటీ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి
మ్యాక్స్ సినిమాలో కిచ్చా సుదీప్..
Behind the scenes of MAX@theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shekarchandra71 @ganeshbaabu21 @shivakumarart @dhilipaction @kevinkumarrrr @ChethanDsouza @saregamasouth #saregamakannada@ZeeKannada @TSrirammt @Max_themovie @KRG_Connects @B4UMotionPics… pic.twitter.com/u7EB00RDRE
— Kichcha Sudeepa (@KicchaSudeep) December 10, 2024
కాగా సుదీప్ తర్వాత బిగ్ బాస్ కన్నడ షోకి ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ‘ నా తర్వాత ఎవరైనా ఈ షోకు హోస్ట్ గా రావచ్చు. అయితే మీరు నాలా చేయాలనుకుంటున్నారా లేదా అనేది మరొక ప్రశ్న. ఆ పోలిక తీసుకు రావొద్దు. ప్రతి ఒక్కరికి వారి స్వంత వ్యక్తిత్వం ఉంటుంది’ అని సుదీప్ తెలిపాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.