Avanthi Srinivas: ఇది మంచి పద్దతి కాదు.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా.. సంచలన వ్యాఖ్యలు

Avanthi Srinivas: ఇది మంచి పద్దతి కాదు.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా.. సంచలన వ్యాఖ్యలు


సాధారణ ఎన్నికల్లో అసాధారణ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీకి.. షాకుల మీదద షాకులు తగులుతున్నాయి.. ఇప్పటికే, పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, పలువురు నేతలు పార్టీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. తాజాగా.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేశారు.. పార్టీ, పదవులకు రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్‌.. వైసీపీ అధిష్ఠానానికి రాజీనామా లేఖ పంపించారు.. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.. రాజకీయాలతో లబ్ధిపొందాలనే ఉద్దేశం తనకు లేదని.. ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానంటూ అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అవంతి శ్రీనివాస్.. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా శ్రీనివాస్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రజాసేవలోనే ఉంటానని.. ఇప్పటికీ ఏ పార్టీలో చేరాలని నిర్ణయించుకోలేదని అవంతి శ్రీనివాస్ తెలిపారు.. తనకు ఎక్కడ గౌరవం లభిస్తుందని అనుకుంటే అటువైపు వెళ్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు.. వైసీసీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలియడంలేదని పేర్కొన్నారు. వైసీపీలో కార్యకర్తలు, నాయకులకు గౌరవం కొరవడిందని.. అందర్నీ అడగకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ పేర్కొన్నారు. జమిలి ముంచుకొస్తోందని ధర్నాలు చేయమంటున్నారు.. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.

ఐదేళ్లుగా వైసీపీలో కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని.. అంతా వాలంటీర్లే నడిపించారంటూ మాజీ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదే అయ్యిందని.. ప్రభుత్వానికి సమయం ఇవ్వాలంటూ పేర్కొన్నారు.. అలాకాకుండా అప్పుడే ధర్నాలకు పిలుపునిచ్చారని.. ఇప్పటికే వైసీపీలో ఐదేళ్లుగా నలిగిపోయి ఉన్నామని శ్రీనివాసరావు పేర్కొన్నారు.. ఆదేశాలు ఇవ్వడం చాలా ఈజీ.. అన్ని విషయాలు అర్థం చేసుకోవాలన్నారు.. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. ఎన్నికల హామీలు అమలు చేస్తారా లేదా అన్నది ప్రజలు చెబుతారన్నారు.. ఐదేళ్లు కాదు కదా ఐదు నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలకు పిలుపునిచ్చారు.. ఇది మంచి పద్ధతి కాదంటూ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.. పార్టీలో అడ్జస్ట్ కాలేకపోయాను.. వ్యక్తిగతంగా ఐదేళ్లు మా కుటుంబానికి కూడా చాలావరకు దూరమయ్యానన్నారు.. తన వ్యక్తిగత కరణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి బాధితులకు వైసీపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలని… తన రాజీనామాను ఆమోదించవలసినగా కోరుతున్నానంటూ జగన్ ను కోరారు.. ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లికి రాజీనామా లేఖను పంపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *