కొత్త సంవత్సరం ఐదు రాశుల వారికి దిగ్బల రాజయోగం పట్టించబోతోంది. ఈ దిగ్బల యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా రాజపూజ్యాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడుగా, సంపన్నుడుగా, సమర్థుడుగా, శక్తిమంతుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. గురు, బుధుల్లో ఒకరు మొదటి స్థానంలోను, శుక్ర, చంద్రుల్లో ఒకరు చతుర్థ స్థానంలోను, శని సప్తమ స్థానంలోనూ, కుజ, రవుల్లో ఒకరు దశమ స్థానంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దిగ్బల రాజయోగం కలుగుతుంది. వృషభం, సింహం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి ఈ యోగం పడుతోంది.
- వృషభం: ఈ రాశిలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కలిగింది. గురువు ధన కారకుడైనందువల్ల ఈ రాశివారికి అపార ధన లాభం కలుగుతుంది. అనేక విధా లుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. గురువు మే 25 వరకూ ఇదే రాశిలో సంచారం చేస్తున్నందు వల్ల అప్పటి వరకూ ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి.
- సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఏ రంగంలో ఉన్నప్పటికీ అందలాలు ఎక్కడం జరు గుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి తప్పకుండా రాజయోగాలు పడతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారి కల నెరవేరుతుంది. ఆదాయం కొద్ది కొద్దిగా పెరిగి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజ యాలు సాధిస్తారు. విద్యార్థులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆరోగ్య లాభం కలుగుతుంది.
- తుల: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వచ్చే నెల 28 వరకు దిగ్బల యోగం కలిగింది. దీని వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత వృద్ది చెందుతుంది. సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. వాహన యోగం పడుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. మాతృ సౌఖ్యం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, లాభాలు ఎక్కువగా ఉంటాయి.
- వృశ్చికం: ఈ రాశిలో బుధ సంచారం కారణంగా ఈ రాశివారికి దిగ్బల యోగం కలిగింది. జనవరి 4వ తేదీ వరకు వీరికి ఆదాయపరంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. తక్కువ శ్రమతో అత్యధిక లాభాలు కలుగుతాయి. అనేక విషయాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇంటా బయటా మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశివారికి దశమ స్థానంలో రవి కారణంగా జనవరి 16 వరకు దిగ్బలం పట్టింది. దీని వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. షేర్లు, స్పెక్యు లేషన్ల వల్ల అపార ధన లాభం కలుగుతుంది. రాజకీయ నేతలకు ప్రాధాన్యం, ప్రాభ వం బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.