Apple iphone: ఈ నెల నుంచి చాలా దేశాల్లో ఈ 3 ఐఫోన్ల విక్రయాలు బంద్‌.. కారణం ఏంటో తెలుసా?

Apple iphone: ఈ నెల నుంచి చాలా దేశాల్లో ఈ 3 ఐఫోన్ల విక్రయాలు బంద్‌.. కారణం ఏంటో తెలుసా?


రాబోయే కొద్ది రోజుల తర్వాత Apple తన 3 iPhone మోడల్‌లను యూరోపియన్ యూనియన్ (EU)లో విక్రయించదు. డిసెంబర్ 28 నుండి ఐరోపాలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ SE 3వ జనరేషన్‌ అమ్మకాలను కంపెనీ నిలిపివేస్తుంది. ఈ ఫోన్లన్నీ లైట్నింగ్ కనెక్టర్‌తో వస్తాయి. యూరోపియన్ నిబంధనల ప్రకారం, అటువంటి కనెక్టర్ ఉన్న ఫోన్‌ల అమ్మకం వచ్చే ఏడాది నుండి నిషేధించనున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 28 నుంచి ఐరోపాలోని మొత్తం 27 దేశాల్లో యాపిల్ తమ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది..

యూరప్ నియమాలు ఏంటి?

EU 2022లో తన మొత్తం 27 దేశాల్లో విక్రయించే ఫోన్‌లు, కొన్ని ఇతర గాడ్జెట్‌లు USB-C పోర్ట్‌లను కలిగి ఉండాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినప్పుడు ఆపిల్ దానిని సవాలు చేసింది. కానీ 2023లో USB-C పోర్ట్‌తో iPhone 15ని ప్రారంభించింది. అదేవిధంగా ఆపిల్ క్రమంగా దాని అన్ని ఐప్యాడ్‌లలో USB-C పోర్ట్‌లను అందించడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

స్విట్జర్లాండ్‌లో అమ్మకాలు ముందుగానే ఆగిపోవచ్చు:

స్విట్జర్లాండ్‌లో వాటి విక్రయాలు డిసెంబర్ 20 నుండి ఆగిపోవచ్చు. స్విట్జర్లాండ్ ఐరోపాలో భాగం కానప్పటికీ, దానిలోని అనేక చట్టాలు EU చట్టాల మాదిరిగానే ఉన్నాయి. యూరప్, స్విట్జర్లాండ్‌తో పాటు, ఈ నిర్ణయం ఉత్తర ఐర్లాండ్‌లో కూడా ప్రభావం చూపుతుంది. ఇక్కడ కూడా ఈ మూడు మోడళ్ల అమ్మకాలు నిలిచిపోనున్నాయి.

భారతదేశంలో..

భారత్‌లో ఈ ప్రభావం ఉండదు. ఐఫోన్ 14 విక్రయం కొనసాగుతుంది. వీటిని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. భారత ప్రభుత్వం USB-C పోర్ట్‌కు సంబంధించి నిబంధనలను తీసుకురావడాన్ని కూడా పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది జూన్ నుండి భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లకు USB-C పోర్ట్ తప్పనిసరి చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2026 నుంచి ల్యాప్‌టాప్‌లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *