AP Rains: బాబోయ్.! ఏపీలో జోరుగా వానలే వానలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు

AP Rains: బాబోయ్.! ఏపీలో జోరుగా వానలే వానలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు


ఉమ్మడి చిత్తూరు జిల్లాపైనా అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతి, తిరుమలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో ఫెయింజల్‌ తుఫాన్‌ ప్రభావంతో అపారనష్టం జరిగింది. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు పంటల రైతులు ఆందోళన చెందుతున్నారు.

అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా.. నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, కావలి వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి బ్యారేజ్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అలెర్ట్‌ అయింది.

తమిళనాడుపై అల్పపీడనం ఎఫెక్ట్‌ తీవ్రంగా కనిపిస్తోంది. తమిళనాడులో మరోసారి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడులోని 17 జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అటు.. వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *