పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం డిసెంబర్ 22న అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదిలి డిసెంబర్ 24 నాటికి ,ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో ఉన్న నైరుతి బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం..
డిసెంబర్ 23, సోమవారం : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం,నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 24, మంగళవారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..