సోమవారం నాటి బాగా గుర్తించబడిన అల్పపీడనం దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగింది. అయితే, అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, నైరుతి దిశగా ఎత్తుకు వెళ్ళేకొలది వంగి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-నైరుతి వైపు కదులుతూ క్రమంగా బలహీనపడి అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
—————————————-
మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
బుధవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————
మంగళవారం, బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
గురువారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ;-
——————————
మంగళవారం, బుధవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
గురువారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..