AP News: శివారు పొలంలో పని చేస్తుండగా ఏదో అలికిడి.. అటు వెళ్లి చూడగా బిత్తరపోయిన రైతు

AP News: శివారు పొలంలో పని చేస్తుండగా ఏదో అలికిడి.. అటు వెళ్లి చూడగా బిత్తరపోయిన రైతు


పాములంటే భయపడని వారెవరుండరు. అసలు అమ్మో పాము.! అన్నామంటే చాలు పాము కనిపించినా.. కనిపించకపోయినా.. చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా చెంగుమని గంతులు వేస్తూ అక్కడి నుంచి పారిపోతారు. అలాంటిది ఏకంగా ఒకేసారి రెండు పాములు కంటబడితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది. అందులోనూ అవి మనిషిని సైతం అమాంతం మింగేసే అంత పెద్దగా ఉంటే ఎంత భయం వేస్తుందో ఊహించుకుంటేనే ఒళ్లంతా గగుర్పాటుకు గురవుతుంది. తాజాగా పెద్ద కొండచిలువలు స్థానికులను హడలెత్తించాయి. భయంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. అయితే కొందరు యువకులు ధైర్యం చేసి కర్రలు, పలుగులతో వాటిని చంపడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఇది చదవండి: మీరు నిజంగానే తోపులైతే.. ఈ ఫోటోలో దాగున్న నెంబర్ కనిపెట్టగలరా.?

వివరాల్లో వెళ్తే.. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రామన్నపాలెం శివారు ఓ తోటలో స్థానిక రైతులు, కూలీలు పని చేసుకుంటున్నారు. అదే సమయంలో మొక్కలు గుబురుగా ఉన్న ప్రదేశంలో ఓ పెద్ద అలికిడి అతనికి వినిపించింది. వెంటనే అతడు ఏమై ఉంటుందా అని అక్కడికి వెళ్లి చూడగా.. ఇంకేముంది పెద్ద పెద్ద అనకొండ సైజులో ఉన్న రెండు భారీ కొండచిలువలు ఆ రైతు కంటపడ్డాయి. అక్కడి నుంచి వెంటనే అతను పరుగులు తీసి స్థానిక రైతుల వద్దకు వచ్చి విషయం వారికి చెప్పాడు. ఆ రెండు కొండచిలువలు ఒకదాని పక్కన మరొకటి కదులుతూ ముందుకు సాగాయి. ఒక్కొక్క కొండచిలువ సుమారు పది అడుగులకు పైగా పొడవు ఉంది. దీంతో వారంతా హడలెత్తిపోయి అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

అయితే విషయం ఆ నోటా ఈ నోటా గ్రామంలోని యువకులకు చేరడంతో ధైర్యం చేసి కొందరు అక్కడికి చేరుకున్నారు. కర్రలు, పెద్దపెద్ద గుణపాల సహాయంతో పాముల వద్దకు వెళ్లి వాటిని కొట్టి చంపారు. అనంతరం వాటిని తోటలోంచి బయటకు తీసుకువచ్చి స్థానికులకు చూపించారు. కొంతమంది తమ సెల్‌ఫోన్లలో చనిపోయిన పెద్ద కొండచిలువలను ఫోటోలు తీసుకుని తమ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకోవడంతో విషయం కాస్త వైరలై ఇప్పుడు ఈ విషయం ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది చదవండి: గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *