వారి కాలి స్పర్శ తగిలితే రోగాలు నయం అవుతాయట.. సంతానం కలుగుతుందట.. సుఖ సంతోషాలతో ఉంటారట… శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో ఈ వింత ఆచారం తాలూకా వివరాలు తెలుసుకుందాం పదండి. మార్గశిర మండలం భక్తరహళ్లి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ ఓ వింత ఆచారం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. విచిత్ర వేషధారణలతో… చేతిలో కత్తులు పట్టుకుని ఆహాకారాలు చేసుకుంటూ భూతప్పలు భక్తులను తొక్కుకుంటూ వెళ్లడం అక్కడి ఆచారం. భూతప్పలు నడుచుకుంటూ వెళ్లే దారిలో వాళ్ల కాలి స్పర్శ కోసం వేల సంఖ్యలో భక్తులు పొర్లుదండాలు పెడతారు. ప్రతి ఏటా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవం రోజు భక్తులు ఉపవాస దీక్షలతో భూతప్పలు నడుచుకుంటూ వెళ్లే దారిలో తడి బట్టలతో బోర్లా పడుకుంటారు… ఆడ, మగ తేడా లేదు… చిన్న, పెద్ద భేదం లేదు… బోర్లా పడుకుంటే భూతప్పలు భక్తులను తొక్కుకుంటూ వెళతారు…. అలా భూతప్పల ఖాళీ స్పర్శ తగలగానే… భక్తులు ఎంతో సంతోషంతో సంబరపడిపోతుంటారు. ఎందుకంటే భూతప్పల కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని… సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని… పిల్లలకు చదువు… కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందని భక్తుల విశ్వాసం.
ఎన్నో ఏళ్లుగా మడకశిరలో జరిగే ఈ వింత ఆచారాన్ని ఆంధ్ర, కర్ణాటక నుండి వచ్చే భక్తులు నమ్ముతారు. భూతప్పల విన్యాసాలు…. కాలి స్పర్శ కోసం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తడి బట్టలతో బోర్లా పడుకుని భూతప్పలతో తొక్కించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అని… ఇది ఎంత మాత్రం మూఢనమ్మకం కాదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
(ఈ నమ్మకాలను టీవీ9 సమర్థించడం లేదు. అక్కడి వింత ఆచారాన్ని మీ ముందుకు తెచ్చే ప్రతయ్నం చేశాం అంతే)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి